మహిళలను లైంగిక వేధింపులకు గురించిన సంఘటనలు తరచూ చూస్తున్నాం. అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. మాయ మాటలు చెప్పి లోబరుచుకుంటున్నారు కొందరు మృగాళ్లు. కానీ అందుకు భిన్నంగా ఓ మైనర్ బాలుడిపై ఏకంగా ఓ ఇద్దరు పిల్లల వివాహిత కన్నేసింది. చనువుగా ఉంటూ బుట్టలో వేసుకుంది. శారీరక వాంఛను తీర్చాలని తరచూ సదరు బాలుడిని వేధింపులకు గురిచేయడమేగాక.. ఇద్దరం కలిసి ఎక్కడికైనా పారిపోదామని బలవంత పెట్టసాగింది. దీంతో హడలెత్తిపోయిన సదరు బాలుడు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. ఈ విచిత్రకర సంగటన చత్తీస్‌ఘడ్ రాష్ర్టంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం లోని బిలాస్‌పూర్‌కు చెందిన 27 ఏళ్ల మహిళకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె కన్ను వారి ఇంటి పొరుగున ఉండే 17 ఏళ్ల బాలుడి పై పడింది. అంతే ఆ బాలుడు ఒంటరిగా కనిపిస్తే చాలు చిలిపిగా మాట్లాడడం మొదలు పెట్టింది. శృంగార పాఠాలను బోధించడం మొదలు పెట్టింది. శారీరక వాంఛలను తీర్చాలని బలవంత పెట్టసాగింది. ఇదిలా ఉండగా ఇటీవల ఊహించని రీతిలో భర్తను, పిల్లలను వదిలేసి వచ్చేస్తానని, ఇద్దరం కలసి ఎక్కడికైనా పారిపోదామని చెప్పడంతో ఆ బాలుడి గుండె జారిపోయింది. అప్పటి నుంచి అన్యమనస్కంగా ఉండడంతో పాటు ఆందోళనకు గురవుతున్నాడు. కుమారిడి ప్రవర్తనను గమనించిన తండ్రి మెల్లగా అనునయించి అసలు విషయం ఆరా తీశాడు. దీంతో పక్కింటి ఆంటీ పెడుతున్న టార్చర్ గురించి చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు బాలుడు. దీంతో కంగుతిన్న తండ్రి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆమెను పిలిపించి ఇదే విషయమై ప్రశ్నించారు. అయితే ఆమె ఏమాత్రం తడబడకుండా భర్త మీద ఇష్టం లేకనే బాలుడి వెంట పడినట్లు ఆమె ఒప్పుకోవడం చూసి నోరెళ్లబెట్టారు.