ప‌వ‌న్ వ‌ర్సెస్ రామ్‌చ‌ర‌ణ్‌… ఫ్యాన్స్ మ‌ధ్య మ‌ళ్లీ ఇదో కొత్త గొడ‌వరా బాబు…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐదు సినిమాలు ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్నాయి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న బ్రో సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ – క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు – హరీశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఓజీ సినిమాను డివీవి ఎంటర్టైన్మెంట్ బ్యాన‌ర్ పై త్రిబుల్ ఆర్ సినిమా నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక బ్రో సినిమా జులై 28న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజ‌ర్‌స్ సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో స్టార్ డైరెక్టర్ శంకర్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కానుంది.

Ram Charan's Game Changer first look poster trolled. Fans call it  'disappointing' - India Today

విచిత్రం ఏంటంటే అటు బాబాయ్, ఇటు అబ్బాయి రెండు సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఈ రెండు పెద్ద సినిమాల మధ్య బాక్సాఫీస్ క్లాష్‌ తప్పేలా లేదు. ఇదే జరిగితే మెగా అభిమానులు మధ్య ఏ సినిమాకు ? భారీ హంగామా చేయాలి అన్న విషయంలో పెద్ద రచ్చే షురూ కానుంది. అయితే వారం రోజులకే ఇద్దరు మెగా హీరోల సినిమాలు వస్తే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.