త‌న‌ను క్యాస్టింగ్ కౌచ్ కోసం టార్చ‌ర్ పెట్టిన టాలీవుడ్ హీరోపై నోరు విప్పిన హ‌న్సిక‌…!

తెలుగు సినిమా పరిశ్రమలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించి తన అందంతో ఆకట్టుకుంది యాపిల్ బ్యూటీ హన్సిక. హన్సిక తమిళ అమ్మాయి అయినా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 2007లో వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు. తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. హన్సికకు తెలుగు యూత్‌లో ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

Hansika Motwani is a true 'beach baby,' these five sexy photos prove it

15 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగిస్తూ వస్తున్న హన్సిక రీసెంట్‌ గా బిజినెస్ టైకూన్ సోహైల్ ఖ‌తూరియాను వివాహం చేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ చక్కగా ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే గత నాలుగు ఐదు రోజులుగా హన్సిక గురించి తెలుగు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. తన కెరీర్ ప్రారంభంలో ఒక టాలీవుడ్ టాప్ హీరో హ‌న్సికను బాగా వేధించాడని.. అలానే ఆ హీరో హ‌న్సిక‌ను డేటింగ్‌కు రావాలని ఒత్తిడి చేశాడని రూమర్ వైరల్ అవుతుంది.

Hansika Motwani Hot Photos

దీంతో తెలుగు సోషల్ మీడియాలో ఆ తెలుగు హీరో ఎవరు ? ఉంటారు అన్నదానిపై చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని హన్సిక తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఆధారం లేని ఊహాగానాలతో తాను విసుకు చెందుతున్నానని.. ఇలాంటి కథనాలు ప్రచురించే ముందు దయచేసి వాస్తవాలు తెలుసుకోవాలని ఆమె మీడియాని కోరింది. ఇక హ‌న్సిక కెరీర్ విష‌యానికి వ‌స్తే పార్టనర్, 105 మినిట్స్, నా పేరు శృతి, రౌడీ బేబీ, గాంధారి మరియు గార్డియన్ సినిమాల్లో న‌టిస్తోంది.