చెన్నై – గుజరాత్ క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్ 1 ఫిక్స్‌… ప‌క్కా ఆధారాల‌తో ప‌ట్టేశారు…!

చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ 1 పై రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మామూలుగా చూస్తే ఈ మ్యాచ్లో గుజరాత్ తిరిగిలేని హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. చెన్నైతో పోలిస్తే అన్ని విభాగాలలోను గుజరాత్ బలంగా ఉంది. కచ్చితంగా ఈ మ్యాచ్లో గుజరాత్ విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్ కి వెళుతుందని భారీ ఎత్తున బెట్టింగులు నడిచాయి. తీరా ఈ మ్యాచ్లో గుజరాత్ 15 పరుగులు తేడాతో ఓడిపోయాక.. గుజరాత్ కావాలని ఓడిపోయిందని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అందుకు కొన్ని ఉదాహరణలు కూడా వారు చూపిస్తున్నారు. గుజరాత్ బౌలర్లు ఈ సీజన్లో ఎప్పుడూ లేనంత ఉదాహరణంగా వ్యవహరించారని.. వికెట్లు తీసి పరుగులు నియంత్రించినా అది వారి స్థాయి కాదన్న విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే కష్టసాధ్యం కానీ 173 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ బ్యాట‌ర్లు కావాలనే వికెట్లు పారేసుకున్నారని.. అంఫైర్లు కరెక్ట్ గా లేకపోయినా కెప్టెన్ నుంచి ఎలాంటి రిప్లై కూడా లేదని చెబుతున్నారు.

ఇక తెవాతియా, మిల్లర్ కూడా చాలా నిర్లక్ష్యమైన షాట్లు ఆడి కావాలని వికెట్లు పారేసుకున్నారని చెబుతున్నారు, ఇక ఫీల్డర్ మార్చటాన్ని గమనించిన కూడా హార్దిక్ పాండ్యా అటువైపే షాట్‌ ఆడి మరి అవుట్ కావడంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక చాలా డౌట్ గా ఉన్న విజయశంకర్ క్యాచ్‌ను పూర్తిగా పరిశీలించకుండానే అవుటుగా ప్రకటించడం… రిప్లైలో కూడా బంతి నేలకు తాకినట్టు కనిపిస్తున్న ఎవరూ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక పతిరన విషయంలో 16వ ఓవర్ లో ఎంపైర్లు ధోనీకి రూల్స్ కు వ్యతిరేకంగా పతిరన బౌలింగ్ చేసిన గుజరాత్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని అంటున్నారు. ఇక ఇప్పుడు లేనివిధంగా గుజరాత్ ఈ మ్యాచ్లో ఆల్ అవుట్ కావడంపై కూడా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలు, ఆరోపణలు ఇలా ఉంటే నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ ను ఓడించడంతో చెన్నై ఐపీఎల్ చరిత్రలో 10వసారి ఫైనల్ కు చేరిన జట్టుగా రికార్డులకు ఎక్కింది.