పవన్ VS బాలయ్య .. ఇద్దరిలో బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టిన స్టార్ ఎవ‌రు…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలలో నరసింహనాయుడు ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటి.. 2001లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక అదే సంవత్సరం ఈ సినిమాకు పోటీగా వచ్చిన సినిమా ఖుషి.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్- భూమిక హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా విడుదలయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ వరుసగా 6 విజయాలను అందుకున్నారు.

ఆ తర్వాత రిలీజ్ అయిన ఖుషి సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అదేవిధంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌ను కూడా టర్న్ తెప్పిందని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అప్పటికే పవన్ కళ్యాణ్ తన ఫాలోయింగ్ భారీగా పెంచుకున్నారు.. 2001 లో విడుదలైన ఖుషి నరసింహనాయుడు సినిమాలో అప్పటి రికార్డ్స్ ని తిరగరాసాయి. ఈ రెండు సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది అనేది చాలామందికి తెలియదు.

కలెక్షన్ల విషయంలో చూస్తే న‌ర‌సింహానాయుడు సినిమా రూ.22 కోట్ల షేర్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి రూ.కోట్ల షేర్ ను రాబట్టింది. నెల్లూరు, ఉత్తరాంధ్ర, గుంటూరు,ఈస్ట్ ,వెస్ట్ క‌ర్ణాట‌క వంటి ప్రాంతాల్లో ఖుషి కంటే నరసింహ నాయుడుకే ఎక్కువ కలెక్షన్ తెచ్చుకుంది.

నరసింహానాయుడు సంక్రాంతికి రిలీజ్ అయితే, మూడు నెలల తర్వాత ఖుషి రిలీజ్ అయ్యింది. అప్పట్లో కలెక్షన్ల కంటే ఎన్ని సెంటర్స్ లో సినిమా ఆడింది అన్నదాన్ని బట్టి సినిమా హిట్‌ను నిర్ణ‌యించేవారు. న‌ర‌సింహానాయుడు సినిమా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడగా, ఖుషి సినిమా 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇలా ఈ రెండు సినిమాల్లో బాలయ్య సినిమానే ఆ సంవత్సరం పై చేయి సాధించింది.