టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ లాంటిది డిజాస్టర్ తర్వాత ఎంతో కసిగా నటించిన సినిమా ఖుషి.. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. శివనిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.
తొలి రోజున ఈ సినిమా రూ.30.1కోట్ల కలెక్షన్లు చేసింది. లైగర్ తర్వాత వచ్చిన సినిమాకి హిట్ టాక్ రావడంతో విజయ్ సైతం మంచి కం బ్యాక్ ఇచ్చాడు. విజయ్- సమంతల ఖుషి రెండో రోజు కూడా అదే జోరుని కొనసాగించింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసుళ్లు సాధించినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షను సాధించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ మిలియన్ డాలర్ల మార్క్ ను దాటి రెండు మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు రూ.30 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో జయరాం,మురళి శర్మ, లక్ష్మి,ఆలీ, రోహిణి, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా విజయం సాధించడంలో కీలకపాత్రర పోషించారు.