ఆ ఇద్దరూ హీరోయిన్లు కలిసి నటిస్తే సినిమా ప్లాపే… చివ‌ర‌కు ఆ స్టార్ హీరోల‌ను కూడా ముంచేశారుగా…!

90లో యూత్ ని పిచ్చి ఎక్కించిన హీరోయిన్ ఎవరంటే నగ్మా అని అందరూ చెబుతారు.. గ్లామర్ పాత్రలో ఆమెను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోలతో ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. నగ్మా.. సరదా బుల్లోడు, మేజర్ చంద్రకాంత్ ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు వంటి సినిమాలతో అప్పటి యూత్ కి బాగా దగ్గరయింది. అప్పట్లో నగ్మాకి పోటీగా సౌందర్య తెలుగింటి అమ్మాయిల అమ్మోరు, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

నగ్మా- సౌందర్య ఇద్దరు 90లో సౌత్ ఇండియన్ సినిమాలను ఒక ఊపు ఊపారు. వీరిద్దరూ విడిగా నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే మాత్రం ఆ సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయాయి. అలాంటి వాటిలో కె. మురళి మోహన్ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించిన సినిమా సూప‌ర్ పోలిస్‌.. 1994లో వ‌చ్చిన ఈ మూవీ తెలుగుతో పాటో కోలీవుడ్‌, బాలీవుడ్‌లో విడుద‌లైంది.

అంతే కాకుండా ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వెంకటేష్, నగ్మా, సౌందర్య జంటగా నటించారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాఫ్ గా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ నగ్మా- సౌందర్య కలిసి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలో నటించారు. శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్, క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో “రిక్షావోడు” విడుదలైంది. ఈ సినిమాలో నగ్మా, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు.

ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం పోషించారు. చిరంజీవి రిక్షావోడుగా మాస్ లుక్ తో అభిమానులను అలరించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం పరాజయం పాలైంది. ఇలా ఒక ఏడాది గ్యాప్ లోనే నగ్మా ,సౌందర్య కలిసి నటించిన సూపర్ పోలీస్, రిక్షావోడు వంటి చిత్రాలు ఫెయిల్యూర్ కావడంతో ఆ తర్వాత నిర్మాతలు తాము నిర్మించబోయే ఏ సినిమాలో కూడా నగ్మా, సౌందర్య ఇద్దరికీ కలిపి తీసుకోలేదట.