భువ‌నేశ్వ‌రికి మాట ఇచ్చిన ప‌వ‌న్‌… ఆమెకు ఏం చెప్పారంటే…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి కేంద్ర కర్మాగారంలో ఉన్న టిడిపి అధినేత పవన్ కళ్యాణ్ తో ములాఖ‌త్‌ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ – హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. తాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి వెళుతున్నానని క్లియర్ గా తేల్చి చెప్పారు.

ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చను అని.. తామందరం కలిసి జగన్‌ను గద్దె దింపే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే నారా భువనేశ్వరిని సైతం ఓదార్చిన పవన్ శాసనసభ సాక్షిగా వైసీపీ నేతలు మిమ్మల్ని అవమానించినప్పుడు ఎంతో బాధపడ్డానని… మళ్లీ మీ ముఖంలో నవ్వు కనపడేలా కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.

అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపుతామ‌ని.. ఎవ‌రి చేతుల్లో అయితే భువ‌నేశ్వ‌రికి అవ‌మానం జ‌రిగిందో అందుకు తాను సైతం త‌న వంతుగా బ‌దులు తీర్చుకుంటాన‌ని ప‌వ‌న్ ఓపెన్‌గానే చెప్పిన‌ట్ల‌య్యింది. ఇక లోకేష్ సైతం నాకు అన్న‌గా ప‌వ‌న్ అండ‌గా ఉన్నార‌ని చెప్పారు. ఏదేమైనా నంద‌మూరి + నారా + కొణిదెల కుటుంబాలు అయితే ఒక్క‌ట‌వుతున్నాయి. రేప‌టి రోజున ఈ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు క‌లిసి క‌ట్టుగా పోరాటం చేస్తున్నాయి.