చరణ్‌కు పుట్టబోయే బిడ్డకు పవన్ కళ్యాణ్ పంపిన గిఫ్టు… వావ్ మ‌న‌వ‌డిపై ప‌వ‌ర్‌స్టార్ ప్రేమ‌…!

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా ద్వారా తను చేసే సేవలు ద్వారా అభిమానులకు ఎంతగానో దగ్గరవుతున్నారు. ఇక ఈ మెగా కోడలు అతి త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. త‌ల్లియిన‌ తర్వాత కొద్ది రోజులకే తన వ్యాపారాల్లో బిజీ కావాలని ఉపాసన భావిస్తున్నారని తెలుస్తుంది. ఉపాసనకు సోషల్ మీడియాలో కూడా హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Women's Day: Upasana Kamineni Konidela on women empowerment, healthcare and  marriage with Ram Charan | HealthShots

ఇదే సమయంలో గర్భవతిగా ఉన్న ఉపాసనకు రష్యా నుంచి ఎవరూ ఊహించని ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. అది కూడా తన చిన్న మామ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా రష్యాలో దొరికే ఓ ఖరీదైన ప్రూట్స్‌తో పాటు దుస్తులను ఉపాసనకు బహుమతిగా ఇచ్చారని తెలుస్తుంది. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్‌లు చూసినన ఉపాసన ఆనందానికి అవధులు లేకుండా పోయాయ‌ట. త‌మ‌కు పుట్ట‌బోయే మ‌న‌వ‌డి కోసం ప‌వ‌న్‌, లెజ్నోవా పంపిన ఈ గిఫ్ట్‌లు చూసి ఉపాస‌న ఎంతో మురిసిపోయింద‌ని టాక్ ?

పవన్ భార్య పంపిన గిఫ్ట్ లో అరటి, యాపిల్, నారింజ పండ్లు పంపారని సాధారణంగా గర్భవతిగా ఉన్నవారికి ఫ్రూట్స్ ఎక్కువగా పెడితే వారికి కడుపులో ఉన్న బిడ్డకు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ఈ పండ్లు ఆమె పంపారని తెలుస్తుంది. ఇప్పటికే ఉపవాసన డెలివరీ డేట్ కూడా ఫిక్స్ అయిందట. ఈ నెల మూడో వారంలోనే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలుస్తుంది.

Ram Charan's wife Upasana flaunts her baby bump as she celebrates first  Mother's Day; PIC | PINKVILLA

ఉపాసన విషయంలో రామ్ చరణ్‌నే కాకుండా మెగా ఫ్యామిలీ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. రామ్ చరణ్ కూడా తన షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అని ఓ భారీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో పాటు మరికొందరు స్టార్‌ దర్శకులతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగున్నాడు.