నటసింహం నందమూరి బాలకృష్ణ ఇన్నేళ్ల తన సినీ కెరీలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు కూడా చేశారు. అలాంటి నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ లో బాలీవుడ్ భామలతో కూడా పలు సినిమాలు చేశాడు. బాలయ్య ఇప్పటివరకు బాలీవుడ్ భామలతో చేసిన సినిమాలంటో ఒకసారి చూద్దాం.
బాలకృష్ణ సొంతంగా నిర్మించిన తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో బాలయ్యకు జంటగా బాలీవుడ్ స్టార్ నటి విద్యాబాలన్ నటించింది. బాలయ్య హీరోగా వచ్చిన అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణకు జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించింది. ఈ సినిమా తర్వాత మళ్లీ కత్రినా టాలీవుడ్ లో నటించింది లేదు.
బాలకృష్ణ కెరీర్ లో హిట్ సినిమాల్లో బంగారు బుల్లోడు కూడా ఒకటి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ బాలయ్యకు జంటగా నటించింది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో సినిమా లెజెండ్ ఈ సినిమాలో బాలయ్యకు జంటగా రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ నటించారు. రాధిక ఆప్టే కూడా అప్పటికే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. సోనాల్ చౌహాన్ కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. ఆ తర్వాత సోనాల్ బాలయ్యతో డిక్టేటర్, రూలర్ సినిమాల్లోనూ నటించింది.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన పాండురంగడు సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటించింది. ఈమె అప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించిన బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా మారింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరభద్రలో బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా చేసింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన పరమవీరచక్ర సినిమాలో బాలయ్యకు జంటగా నటించిన అమీషా పటేల్, నేహా ధూపియా కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారే.
బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు తో కలిసి నటించిన సుల్తాన్ సినిమాలో బాలయ్యకు జంటగా నటించిన దీప్తి భట్నాగర్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. బాలయ్య వైవిఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన ఒక్క మగాడు సినిమాలో బాలయ్యకు జంటగా నటించిన నిషా కొఠారి కూడా బాలీవుడ్ లోనే మెప్పించింది.
బాలకృష్ణ – కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన ధర్మక్షేత్రంలో బాలయ్యకు జంటగా నటించిన దివ్యభారతి కూడా తెలుగులో పలు సినిమాలు చేసిన బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మారింది. సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మా కూడా బాలయ్యతో అశ్వమేధం సినిమాలో నటించింది. ఈమె కూడా తెలుగులో పలు సినిమాలో నటించిన తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా వెలిగింది.
బాలయ్య సినిమాలోని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నరసింహనాయుడు సినిమాలో బాలయ్యకు జంటగా నటించిన ప్రీతి జింగానియా కూడా బాలీవుడ్ లో మెరిసిన ముద్దుగుమ్మ. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటిచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలయ్యకు జంటగా నటించిన దీపిక, మధుమతి కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారే.
అలాగే బాలయ్య కెరీర్ మొదట్లో నటించిన భార్గవ రాముడు సినిమాలో కూడా బాలయ్యకు జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మందాకిని నటించింది. ఇలా బాలయ్య తన కెరీర్లో ఇప్పటివరకు ఎందరో బాలీవుడ్ హీరోయిన్లతో నటించి ఆడిపాడాడు. ఇక బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.