టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఇక ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అడుగుపెట్టి దశార్థం పైగా అయిన వరుస సినిమాలతో చిత్ర పరిశ్రమలో దుమ్మురేపుతుంది. ఇక ఈమెకు ఒక తెలుగులోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణిస్తుంది.
ఇక ఈమె ఏమే టెన్త్ క్లాస్ చదువుతున్న రోజుల్లోనే టాలీవుడ్ లో ఆఫర్ వచ్చింది. అంతేకాకుండా పలు యాడ్స్ లో కూడా ఈమెకు నటించే అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తమన్న తన ఒక్కో సినిమాకి రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో నటిస్తే కోటి రూపాయలకు పైగానే ఈమె రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది.
ఇదే సమయంలో తమన్నా మొదటిసారి చేసిన యడ్‌కు సుమారు లక్ష రూపాయలు తీసుకొందట. 2005లో వచ్చిన యాడ్ కోసం మూడు రోజులు తన కాల్ షీట్స్ కు లక్ష రూపాలు రెమ్యునరేషన్ అందుకుంది తమన్న ఇదే విషయాన్ని రీసెంట్గా జరిగిన ఓఇంటర్వ్యూలో చెప్పింది తమన్నా. తనకు వచ్చిన ఆ మొదటి లక్షల రూపాయలను తన కుటుంబంతో ఖర్చు చేసినట్లు ఈ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాలో తొలి హిట్ అందుకుని టాలీవుడ్ లో పాగా వేసింది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న తమన్నా మరికొద్ది రోజుల్లోనే అతని పెళ్లి చేసుకోబోతుందని కూడా తెలుస్తుంది.