ఒకే కథతో వస్తున్న బాలయ్య- వెంకటేష్- నాని… ముగ్గురిలో హిట్ కొట్టేదెవ‌రో…!

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రానున్న రెండు, మూడు నెలల్లో సినిమా జాతర మొదలుకానుంది.. అందులో స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాని, వెంకటేష్ చాలామంది స్టార్ హీరోలు సినిమాలు వరుసగా ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. అయితే అందులో ముగ్గురు హీరోల గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు ఎవరంటే బాలకృష్ణ- వెంకటేష్- నాని ఈ ముగ్గురు హీరోలు తమ తర్వాత సినిమాల కోసం ఒకే కథను ఎంచుకున్నారు.

ఇంతకీ ఆ కథ ఏంటి అనుకుంటున్నారా..? ప్రధానంగా ఈ ముగ్గురు హీరోలు తమ తర్వాత సినిమా కోసం కూతురు సెంటిమెంట్ ను ప్రధానంగా తీసుకున్నారు. అందులో బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్‌ కేసరి.. ఈ సినిమాలో బాలయ్య తన కూతుర్ని కాపాడుకునే తండ్రిగా కనిపించునున్నారు. శ్రీలీల, బాలకృష్ణ కూతురు పాత్రలో నటిస్తుంది.. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కింస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ తర్వాత వస్తున్న వెంకటేష్ సైంధవ్‌ సినిమాను హిట్ సినిమాలతో మంచి హిట్‌ అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను తెర‌కెక్కిస్తున్నాడు.. ఈ యాక్షన్ సస్పెన్స్ సినిమాలో కూడా కూతురు సెంటిమెంట్ ప్రధానంగా కనిపించనుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు చూస్తే ఎంతో క్లియర్గా అర్థమవుతుంది. ఈ సినిమా ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ 22న ప్రేక్షకులు ముందుకు రానుంది.

మరో స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న కూడా కూతురు సెంటిమెంట్ తో ప్ర‌ధానంగా రానుంది అన్న‌ ఈ విషయాన్ని మూవీ టైటిల్ లోనే చెప్పేశారు. ఇక ఈ సినిమాలో సీతారామం సినిమాతో మంచి విజయం అందుకున్న మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కూడా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి దాదాపు ఓకే క‌థ‌తో వస్తున్న ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.