మ‌రో రెండు సినిమాల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ్నీన్‌సిగ్న‌ల్‌..!

సుమారు రెండేళ్ల విరామం త‌రువాత సినిమాల‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు హిరో ప‌వ‌న్‌క‌ల్యాణ్. ఇప్ప‌టికే వ‌రుస‌గా ఒక్కో సినిమాను ప‌ట్టాలెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న, వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హిస్తున్న పింక్ రీమేక్ సినిమాలో కీల‌క న్యాయ‌వాది పాత్రను పోషిస్తున్నారు. ఆ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెప్పాపెట్టకుండా పూర్తి చేసేశారు. దానికి లాయర్ సాబ్ అనే టైటిల్‌ను పెట్టాల‌ని భావిస్తున్నారు. అదేవిధంగా భారీ బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఓ పిరియాడిక‌ల్ డ్రామా చిత్రానికీ ప‌వ‌న్ కొబ్బ‌రికాయా కొట్టారు. అందులో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అదేజోరులో మూడో సినిమాకు కూడా ప‌వ‌న్ ప‌చ్చ‌జెండా ఊపారు. గ‌తంతో గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాతో పీకేకు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను అందించిన హరీష్ శంకర్ ఆ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ట్విటర్ ద్వారా ఇటీవ‌లే ప్రకటించింది. త్వరలో ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ప‌వ‌న్ మ‌రోరెండు సినిమాల‌కు కూడా ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న మూడు సినిమాలు పూర్త‌య్యే నాటికి మ‌రో రెండు సినిమాల‌ను చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. స్టార్ డైరెక్ట‌ర్లు పూరి జ‌గ‌న్నాథ్‌, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అందుకు క‌థ‌ల‌ను సిద్ధం ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ని చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాల టాక్‌. ఇక ఆ సినిమాల‌ను కూడా హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్‌పై తెర‌కెక్కుతాయ‌ని తెలుస్తున్న‌ది. ఏదేమైనా ప‌వ‌న్ వ‌రుస‌గా సినిమాల‌కు ప‌చ్చ‌జెండా ఊపుతుండ‌డంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోతున్నాయి.

ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ రీ ఎంట్రీపై జ‌న‌సేన నేత‌, మాజీ స్ప‌క‌ర్ నాదెండ్ల మ‌నోమ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు చేశారు. ఏపీలో ఎన్నిక‌లు రావాలంటే మ‌రో నాలుగేళ్ల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ఈ లోగా సినిమాల‌ను చేసి ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌నే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు మ‌నోహ‌ర్ తెలిపి ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. అదీగాక త‌మ అధినేత రోజులో 4 నాలుగు గంట‌ల‌ను మాత్ర‌మే సినిమాల‌కు కేటాయిస్తున్నార‌ని, అదీగాక ఏద‌యినా రాజ‌కీయ విష‌య‌మై ఏద‌యిన ఒక రోజు షూటింగ్ను క్యాన్సిల్ చేస్తాన‌ని ష‌ర‌తులు పెడుతున్నార‌ని, అందుకు స‌మ్మ‌తించిన ద‌ర్శ‌కుల‌తో పీకే సినిమాలు చేస్తున్నార‌ని ఆయ‌న వివ‌రించ‌డం గ‌మనార్హం.

Tags: krish, Pawan kalyan, pink, puri jagannath, thrivikram srinivas