OG ‘ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు… స్టోరీ తెలిస్తే పూన‌కాల‌తో ఊగిపోవాల్సిందే…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి అనేక సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. వీటిల్లో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎప్పుడో యేడాదిన్న‌ర క్రితం షూటింగ్ ప్రారంభ‌మైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ఉంది. అస‌లు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో ? కూడా తెలియ‌ట్లేదు. ఇక స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి న‌టిస్తోన్న బ్రో సినిమా షూటింగ్ ముగిసింది. వ‌చ్చే నెల 28న ఈ సినిమా రిలీజ్ కానుంది.

OG - Original Gangsters - Telugu Movie Review, Ott, Release Date, Trailer,  Budget, Box Office & News - FilmiBeat

అలాగే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌తో పాటు సాహో డైరెక్ట‌ర్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓజీ సినిమా కూడా షూటింగుల్లో ఉన్నాయి. ఇక ఓజీ విష‌యానికి వ‌స్తే సాహో త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఓజీ అన‌గా ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ అన్న క్యాప్ష‌న్‌తో ఈ సినిమా వ‌స్తోంది.

త్రిబుల్ ఆర్ సినిమా నిర్మాత దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఓజీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓజీ సినిమా నుంచి మ‌రో అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర పేరు గాంధీ అట‌. గాంధీ అంటేనే సౌమ్య‌త్వానికి మారుపేరు. కానీ ఇక్క‌డ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌కు గాంధీ టైటిల్ పెట్ట‌డంతో అస‌లు సినిమాలో ఎలాంటి మ‌లుపులు ఉంటాయి ? ఎలాంటి యూట‌ర్న్‌లు ఉంటాయి ? అన్న‌ది కాస్త స‌స్పెన్స్‌గా మారింది.

గాంధీలా సౌమ్యంగా ఉండే వ్య‌క్తి… గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారితే ఎలాంటి ర‌చ్చ జ‌రుగుతుంది.. స్క్రీన్ ఎలా షేక్ అవుతుంద‌న్న‌ది విన‌డానికే ఎగ్జైటింగ్‌గా ఉంది… ఏదేమైనా ఈ లైన్‌తోనే సినీ అభిమానుల‌కు పూన‌కాలు ఆగ‌డం లేదు.