అఖిల్ ల‌వ‌ర్‌ను ప‌ట్టేసిన ప‌వ‌న్‌… ఇక ర‌చ్చ రంబోలాయే…!

ఎస్ ఇప్పుడు ఇదే వార్త టాలీవుడ్‌లో సెన్షేష‌న‌ల్ న్యూస్‌గా మారింది. అఖిల్ ల‌వ‌ర్‌ను ప‌వ‌న్ ప‌ట్టేయ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా ? ఇది నిజ‌మే..! అక్కినేని అఖిల్ న‌టించిన పెద్ద డిజాస్ట‌ర్ సినిమా ఏజెంట్ సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది సాక్షి వైద్య‌. ఈ సినిమాలో ఆమె అందానికి, అఖిల్‌తో ఆమె అన్‌స్క్రీన్ రొమాన్స్‌కు టాలీవుడ్ జ‌నాలు ఫిదా అయిపోయారు.

ప‌వ‌న్ ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. క్రిష్ డైరెక్ష‌న్‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్‌తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, సుజీత్ డైరెక్ష‌న్‌లో ఓజీ సినిమాలు చేస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్‌భ‌గ‌త్ సింగ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ గ్లింప్స్‌కు అదిరే రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇక ఈ సినిమాలో ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తోన్న యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రీలీల‌తో పాటు మరో యంగ్ హీరోయిన్ కూడా కనిపించనుంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు… అఖిల్ ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన సాక్షి వైద్య కావ‌డం విశేషం.

Pawan Kalyan's Special Song With Sreeleela?

ఇప్ప‌టికే శ్రీలీల ప‌వ‌న్‌కు జోడీగా న‌టిస్తుండ‌గా.. ఇప్పుడు సాక్షి వైద్య ఎంట్రీతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని చెప్పాలి. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.