పవన్ కళ్యాణ్ కు ఫ్లాప్ ఇచ్చిన కదా.. రవితేజకి బ్లాక్ బస్టర్ హిట్.. ?

మాస్ మహారాజ రవితేజ ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం వ‌రుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక‌ మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో తెలుగు ఇండస్ట్రీ లోకి వ‌చ్చిన పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్‌లో సినిమాలను తీస్తూ సూపర్ హిట్స్ కొడుతూ కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

Ravi Teja, పవన్, రవితేజ మల్టీస్టారర్.. రీమేక్ స్పెషలిస్ట్‌తో ప్రయోగం! - pawan  kalyan and ravi teja do a multistarrer with director dolly - Samayam Telugu

ఇంత‌కి పవన్ కళ్యాణ్ నటించి ఫ్లాప్ సినిమా కథతో రవితేజ సినిమా తీసి సూపర్ హిట్ సాధించాడని మీకు తెలుసా..? ఎస్ పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమా ఫ్లాప్. ఈ సినిమాలో శ్రియా, నేహా ఒబెరాయ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు అశ్వినీదత్ ప్రొడ్యూసర్. గని అనే ఒక గ్యాంగ్‌స్ట‌ర్ ఒక డాక్టర్ స్టూడెంట్‌ను లవ్ చేస్తాడు,, అతనిపై జరిగిన ఎటాక్లో ఆమె చనిపోగా ఆ డాక్టర్ కు ఇచ్చిన మాట కోసం తను రౌడీయిజం మానేసి మరో ప్లేస్ కి వెళ్లి కామన్ మ్యాన్ గా సెటిల్ అవుతాడు గ‌ని. అయితే ఈ కథ నేపథ్యంలో వచ్చిన సినిమా ఫ్లాప్ అయింది.

Tollywood: 'బాలు' మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. చూస్తే అస్సలు  గుర్తుపట్టలేరు.! - Telugu News | Do You Remember Neha Oberoi heroine in Pawan  Kalyan Balu movie, You Will Be Shocked Seeing ...

ఇంచుమించు ఇదే కథతో రవితేజ బలుపు సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్, అంజ‌లి హీరోయిన్స్ గా నటించారు. రవితేజకి ఆపోజిట్ గ్యాంగ్ కి జరిగిన గొడవల్లో అంజ‌లి తన ప్రాణాన్ని వదులుతుంది. తర్వాత అంజలికి ఇచ్చిన మాట కోసం వేరే ప్లేస్ కి వెళ్లి రవితేజ అక్కడ సెటిలైపోతాడు. రవితేజ నటించిన ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలోని మొదటి హీరోయిన్ చనిపోతుంది. రౌడీ గా ఉన్న హీరోస్ మంచివారిగా మారి సాధారణ లైఫ్‌ గడుపుతూ ఉంటారు.

Watch Balupu Full HD Movie Online on ZEE5

ఒకే కథా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మొదటి హీరోయిన్లు ఇద్దరు డాక్టర్స్ రోల్లో నటించారు. కాకపోతే బాలు సినిమాలో హీరోయిన్.. తల్లికి పవన్ కళ్యాణ్ కొడుకుగా మారతాడు. బలుపు సినిమాలో హీరోయిన్ తండ్రి పవన్ కళ్యాణ్ కు తండ్రిగా మారతాడు. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ రెండు సినిమాలకు కోనా వెంకట్‌ రైటర్ గా వర్క్ చేశాడు. అయితే బాలు సినిమా అట్టర్ ఫ్లాప్ కాగా.. రవితేజ నటించిన బలుపు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 29 కోట్లకు పైగా కలెక్షన్ లు కొల్లగొట్టింది.