“అలా చేసుంటే నన్ను చంపేసేవారు ఏమో”..నాగ చైతన్య ఇంత పిరికివాడా..? సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ గా చేస్తున్న సినిమా “కస్టడి”. వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తనదైన స్టైల్ లో సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్న నాగచైతన్య రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Naga Chaitanya's Custody Shoot Wrapped Up

రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు వెంకట్ ప్రభు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..” నిజానికి ఈ సినిమా అంత శివ అనే కానిస్టేబుల్ లైఫ్ జర్నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది . అందుకే ముందుగా ఈ సినిమాకి శివ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం . అయితే నాగచైతన్య ఒప్పుకోలేదు. శివ అనేది ఒక్క కల్ట్ ఫిలిం అని.. అలాంటి సినిమా పేరు నా సినిమాకి పెట్టుకుంటే జనాలు చంపేస్తారని .. అందుకే భయపడిపోయి మరో టైటిల్ని పెట్టమని నాకు చెప్పుకొచ్చారు”.

Custody Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

“అప్పుడే చివరగా ఈ సినిమాకి కస్టడీ అనే టైటిల్ ఫిక్స్ చేసాము “అంటూ చెప్పుకొచ్చారు . మనకు తెలిసిందే శివా అనే సినిమా నాగార్జునకు పర్ఫెక్ట్ లాంచింగ్. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే టీవీకి అతుక్కుపోయి చూస్తూ ఉంటారు . రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే తండ్రి సినిమా పేరును వాడుకుంటే నాగచైతన్య ఎక్కడ ఆ పేరుకి నెగటివ్ మార్క్ తీసుకొస్తారో అని భయపడి “కస్టడి” సినిమా టైటిల్ పెట్టాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!