Amala Paul : అవి బయట పెట్టిన అమలా పాల్ ప్రియుడు..!

స్టార్ హీరోయిన్ Amala Paul కి తన మాజీ ప్రియుడు భవీందర్ నుంచి లైంగిక వేధింపులు అంటూ కేసు వేయగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విచారణలో అతను చెప్పిన మాటలు.. చూపించిన ఫోటోలకు పోలీసులు షాక్ అయ్యారు. హీరోయిన్ గా మంచి ఫాం లో ఉన్న టైం లోనే డైరక్టర్ ఏ.ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లాడింది అమలా పాల్. అయితే ఆ బందం ఎన్నాళ్లో నిలవలేదు.

విజయ్ తో రెండేళ్ల కాపురం తర్వాత Amala Paul అతనికి దూరమైంది. విడాకుల తర్వాత మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది అమలా పాల్. అయితే అమలా పాల్ మాజీ ప్రియుడు భవీందర్ ఈ గ్యాప్ లో దగ్గరయ్యాడు. అతనితో 2019 లో ఓ ఫోటో షూట్ కూడా చేసింది. అది అచ్చం పెళ్లి ఫోటోల్లా ఉండటం విశేషం. అయితే భవీందర్ మాత్రం పోలీసులకు క్లారిటీ ఇచ్చాడట.

2017 లోనే అమలా పాల్ తో తన పెళ్లి జరిగిందని.. దానికి సంబందించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చాడట భవీందర్. సో అమలా పాల్ కి రెండో పెళ్లి కూడా అయ్యిందని తెలుస్తుంది. అయితే పెళ్లై కూడా ఆమె ఎందుకు ఇలా చేస్తుంది అన్నది తెలియట్లేదు. సినిమాల మీద ఎంత ఇష్టం ఉన్నా పెళ్లైన తర్వాత కొన్ని లిమిట్స్ లో ఉండక తప్పదు కదా.

Tags: Amala, Amala Paul, Amala Paul News, Amala Paul Updates, Bhavindar, Hot Heroine, Kollywood