పార్టీ పెట్టింది మొదలు కాషాయ దళ నేతలతో కలిసి తిరిగాడు. ఇటీవలి దాకా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు అంశాలను వ్యతిరేకిస్తూ కమలం నేతలకు దగ్గరయ్యారు. దానిపై పోరాటం చేసేందుకు కూడా సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పలుసార్లు హస్తినకు వెళ్లడగమే గాకుండా బీజేపీ పెద్దలు, మంత్రులతో సమావేశాలను నిర్వహించారు. త్వరంలో ఇరుపార్టీలు కలిసి రాజధాని అంశంపై ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతామని ప్రకటించారు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో ప్రస్తుతం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఏకంగా బీజేపీపైనే తిరుగుబావుటా ఎత్తి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఇప్పడిదే టాపిక్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే రాజధాని ఏర్పాటు అంశంపై కేంద్రం స్పందించింది. అది రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయానుసారమే ఉంటుందని లిఖితపూర్వకంగా స్పష్టం చేసిన విషయం విధితమే. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏమిటంటే ఏపీ రాజధానిగా కొనసాగిస్తామని, అందుకు బీజేపీ ని కూడా ఒప్పిస్తామని ప్రాంతీయ పార్టీల మాటలను నమ్మవద్దని క్లారిటీ ఇచ్చింది. జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పకనే చెప్పింది. బీజేపీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే పవన్ స్పందించారు. ఈ మేరకు పార్టీ తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. రాజధాని రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ నెల 10 తేదీ నుంచి అందుకు సంబంధించిన కార్యాచరణ ఉంటుందని, మరోసార రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని తెలపడం గమనార్హం. అదీగాక ఉద్యమాన్ని దేశ నలుమూలలకు తీసుకెళ్తామని పీకే ప్రకటించి పరోక్షంగా బీజేపీ హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా దీనిపై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. బీజేపీ నిర్ణయం తెలియక ఆ పార్టీతో మొన్నటివరకు తిరిగిరా? లేక లోపాయికారిగా ఏవైనా ఒప్పందాలు చేసుకుని మీదికి ఉద్యమం అంటూ చెబుతున్నాడా? అని రాజకీయ వర్గాలు విళ్లేషిస్తున్నాయి.