రంగులపై కడిగేసిన హైకోర్ట్…!

ఆంధ్రప్రదేశ్ లో రంగుల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ముందు నుంచి ఆశ్చర్యంగా ఉన్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఎక్కడ పడితే అక్కడ రంగులు వేస్తూ ప్రభుత్వం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయంగా కూడా ఇది తీవ్ర దుమారమే రేపింది. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు సైతం ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుబడుతూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై ఏకంగా రాష్ట్ర హైకోర్ట్ లో పిటీషన్లు కూడా దాఖలు చేయడంతో హైకోర్ట్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.

బుధవారం ఈ వ్యవహారంపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుబట్టింది. గ్రామ సచివాలయాలపై వైసీపీ రంగులు ఎందుకు వేసారని కోర్ట్ ప్రభుత్వ తరుపు లాయర్ ని ప్రశ్నించింది. దీనిపై లాయర్ ఆశ్చర్యకర విస్తుపోయే సమాధానం ఇచ్చారు. అవి పార్టీ రంగులు కాదని చెప్పగా మాకు ఆ మాత్రం తెలుసు, మేము రంగులు పోల్చుకుంటాం అని హైకోర్ట్ తిరిగి సమాధానం చెప్పింది. ఇక గ్రామ సచివాలయాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఎందుకు వేసారని ప్రశ్నించింది.

వెంటనే మరో వింత సమాధానం చెప్పగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని వేశామని చెప్పారు లాయర్. మరి పార్లమెంట్ మీద మోడీ బొమ్మ, సుప్రీం కోర్ట్ మీద సీజే బొమ్మ ముద్రించారా అని ప్రశ్నించింది. అదే విధంగా ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ ఉందో చూపించాలని ఆదేశాలు జారి చేసింది. కార్యాలయాల లోపల పెట్టుకోమని సూచించింది. స్పందించిన ఎన్నికల కమీషన్ లాయర్ ఎన్నికల ప్రకటన లేదు కాబట్టి తమకు అధికారం లేదని చెప్పారు. అయితే తామే జోక్యం చేసుకుంటామని, నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అన్ని పార్టీల రంగులు తమకు సమర్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారి చేసింది.

Tags: AP, Colours, high court, Inquiry, ysrcp