2024లో ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం ఫిక్స్‌.. ఈ సారి కొత్త ప్లేస్ ఎక్క‌డంటే..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఎక్కడ ? నుంచి పోటీ చేస్తారు అన్నదానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. గత సాధారణ ఎన్నికలలో జనసేన తొలిసారిగా పోటీ చేసింది. పార్టీ అధినేత హోదాలో పవన్ సొంత జిల్లా పశ్చిమగోదావరిలోని భీమవరంతో పాటు విశాఖ నగరాన్ని ఆనుకుని ఉన్న గాజువాక లోను పోటీ చేశారు. పవన్ రెండుచోట్ల ఓడిపోయారు. అసలు జనసేనకు ఒక సీటు మాత్రమే వచ్చింది. కోనసీమ జిల్లాలోని రాజోలు నుంచి జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాదరావు అనంతరం వైసిపి చెంత చేరిపోయారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గం గురించి  తెలుసుకోండి | AndhraPradeshElections2019: All about Narasapuram  Constituency - Telugu Oneindia

దీంతో ఇప్పుడు అసెంబ్లీలో జనసేనకు ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి. ఇక పవన్ గాజువాక భీమవరం రెండుచోట్ల ఓడిపోయినా భీమవరంలో మాత్రం కాస్త గట్టిగా ఫైట్ ఇచ్చారు. ఇక వచ్చే ఎన్నికలలో జనసేన – టిడిపి మధ్య పొత్తు ఉంటుందన్న చర్చల నేపథ్యంలో పవన్ ఏ నియోజకవర్గం ? నుంచి పోటీ చేస్తాడు.. తాను గతంలో ఓడిపోయిన రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకుంటారా ? లేదా.. ఈసారి నియోజకవర్గం మారతారా అన్నదానిపై జనసేనలోనే రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

File:Pithapuram railway station nameboard.jpg - Wikimedia Commons

జనసేన అంతర్గత చర్చల ప్రకారం ఈసారి పవన్ భీమవరం, గాజువాక కు గుడ్ బై చెప్పేస్తున్నట్టు తెలుస్తోంది. భీమవరం పక్కనే ఉన్న పవన్ సొంత నియోజకవర్గం నరసాపురంతో పాటు కాకినాడ జిల్లాలోని పిఠాపురం ఈ రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం ? నుంచి ప‌వ‌న్‌ పోటీ చేస్తారని తెలుస్తోంది. నరసాపురంలో గత ఎన్నికల్లోనే జనసేన రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుకు డిపాజిట్ కూడా దక్కలేదు.ఇక పిఠాపురం లోను జనసేనకు బలమైన నాయకత్వం కేడర్ ఉంది. ఇక్కడ నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది.

Bhimavaram Jn RLY STN - Bhimavaram

దీనిని బట్టి ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఎంత బలమైన సపోర్టు ఉందో తెలుస్తోంది. ఒకవేళ టిడిపి తో పొత్తు ఉంటే పవన్ నరసాపురం, పిఠాపురం మాత్రమే కాదు భీమవరంలో పోటీ చేసినా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం.అయితే పవన్ ఎందుకు ? ఈసారి గాజువాకపై అంత‌ ఆసక్తితో లేరని భీమవరం కంటే నరసాపురంలో పోటీ చేస్తేనే భారీ మెజార్టీ వస్తుందన్న లెక్కలతో ఉన్నారని తెలుస్తోంది. అలాగే పిఠాపురంలో కూడా పవన్ పోటీ చేస్తే ఎలా ? ఉంటుంది అన్నదానపై జనసేన చేయించుకున్న సర్వేలలో భారీ మెజార్టీ వస్తుందని తెలిందని.. అందుకే పవన్ దృష్టి పిఠాపురంతో పాటు నరసాపురం రెండో ఆప్షన్ గా ఉందని అంటున్నారు.

Tags: AP, ap politics, intresting news, janasena, latest news, latest viral news, Pawan kalyan, social media, social media post, trendy news, viral news, ysrcp