బిజినెస్‌లు చేసి కోట్లను సంపాదించడం అందరికీ తెలుసు. చెట్లను పెంచడం వల్ల కూడా కోట్లు వస్తాయా అని షాక్ అవుతున్నారా..? సహజంగానే చెట్లను పెంచితే పర్యావరణానికి మంచిదన్న విషయం చాలామందికి తెలుసు. అయితే కొన్ని రకాల చెట్లను పెంచడం వల్ల కోట్లలో డబ్బులు సంపాదించవచ్చు. ముఖ్యంగా గంధం, ఎర్రచందనం చెట్లను పెంచితే దాని డబ్బు కోట్లలో ఉంటుంది. కానీ ఇవే కాకుండా ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్లు పెంచుకుంటే అంతకు రెట్టింపు డబ్బు వస్తుందట. ఈ చెట్లు కూడా మన ఎర్రచందనం చెట్ల లాగా చాలా అరుదుగా కనిపిస్తాయి.
ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్లు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీలో పొడిగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే పెంచుతారు. ఈ చెట్లు ఒక కేజీ చెక్క ధర రూ.7 లక్షలు.. సుమారు ఒక చెట్టు నుంచి క్వింటాల్ బరువు గల కలప అందుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఒక్క చెట్టు ధర రూ.7 కోట్ల పైగా విలువ చేస్తుంది. దీన్ని బట్టి అర్థమయ్యే ఉంటుంది ఒక చెట్టును పెంచితే కూడా కోటీశ్వరులు అవ్వచ్చని. షెహనాయ్, ఫ్లూట్, గిటార్ లాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీలో ఈ చక్కని ఉపయోగిస్తారు. అలాగే ఫర్నిచర్ తయారీకి కూడా ఈ కల్పని యూజ్ చేస్తారు.
ఈ చెక్కతో తయారైన ఫర్నిచర్ కేవలం డబ్బున్న వారు.. శ్రీమంతులు మాత్రమే కొంటారు. ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్న ఈ చెట్లు భారీ వృక్షాలుగా ఎదగడానికి 60 సంవత్సరాలు పడుతుంది. దాంతో అవి మహావృక్షాలుగా మారకముందే స్మగ్లర్లు వాటిని నరికేసి మార్కెట్ కు తరలిస్తున్నారు. ఇలా మధ్యలోనే చెట్లను నరికేయడం వల్ల వాటి విలువ మరింతగా పెరిగింది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్‌ని రక్షించడానికి టాంజానియా లాంటి దేశాల్లో ప్రత్యేకమైన బలగాలను ఇస్తున్నారు.
వీటి భద్రతకు ఖర్చు బాగానే అవుతుంది. దీంతో చాలామంది ప్రజలు వాటిని పెంచడానికి ఇష్టపడడం లేదు. ఈ చెట్లు చాలా అరుదుగా పెరిగాయి. ఈ చెట్లను భారతదేశంలో పెంచవచ్చా అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తుంది. భారత దేశంలో నార్త్ ఇండియన్ రోజ్ వుడ్ అని ఈ బ్లాక్ శాండల్ ని పిలుస్తారు. భారతదేశ ప్రజలు దీని పెంచడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ చెట్టు వృక్షాలుగా మారేవరకు కాపాడుకోవడం అనేది చాలా కష్టతరమైన పని. దీంతో ఇటువంటి ప్రయత్నం ఎవరు చేయడం లేదు.