ఎఫ్ -3 నాకు నచ్చలేదు.. వెంకీ ఎలా ఒప్పుకున్నాడో మరి.. పరుచూరి షాకింగ్ కామెంట్స్..!

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమాపై తాజాగా ప్రముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు వెంకటేష్ ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నాడో ఏంటో నాకు అర్థం కాలేదు అంటూ వ్యాఖ్యానించారు.

పరుచూరి పలుకులు..శీర్షికన యూట్యూబ్లో కొద్ది రోజులుగా పరుచూరి గోపాలకృష్ణ సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఎఫ్ 3 గురించి మాట్లాడారు. ‘ సినిమాలో మురళీశర్మ తన కొడుకు 20 ఏళ్ల కిందట తప్పిపోయాడని ప్రకటిస్తాడు. అయితే ఆ ఇంటికి 20 ఏళ్ళ కొడుకుగా వెంకటేష్ వెళ్లడం అస్సలు నప్పలేదు. వెంకీ వయసు మనకందరికీ తెలుసు. అతడిని 20ఏళ్ల పాత్రలో చూడటం అస్సలు నప్పలేదు. వెంకటేష్ కోసం మేము ఎన్నో సినిమాలకు పనిచేశాం. చిన్న లాజిక్ మిస్ అయినా వెంకీ అసలు ఒప్పుకోడు. అలాంటిది ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదు.

ఇక తమన్నా ఫ్యామిలీ సొంతంగా ఒక హోటల్ నిర్వహిస్తుంటే ఆమె చెల్లెలు మెహరీన్ ఒక ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నట్లు చూపడం సెట్ కాలేదు. ఇక తమన్నాను అబ్బాయిలాగా చూపించడం అస్సలు బాలేదు. ఇక సునీల్ ని సినిమా ప్రారంభంలో ఒక వ్యక్తి కత్తితో పొడుస్తాడు. ఆ తర్వాత వెంటనే వచ్చే పాటలో అతడితో డ్యాన్స్ వేయించడం కూడా బాగాలేదు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించి ఉండవచ్చు..కానీ ఫైనల్ గా మాత్రం మనసును హత్తుకునే డ్రామా లేదు’ అంటూ పరుచూరి కామెంట్స్ చేశారు. ఎఫ్ 3 మూవీపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Tags: director anil ravipudi, f3 movie, story writer paruchuri gopalkrishna, tollywood news, varun tej, Venkatesh