Balakrishna : బాలయ్య 107.. ఆ రెండు టైటిల్స్ లో ఒకటి ఫిక్స్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్.బి.కె 107 గా రాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ హిట్ తో బాలయ్య.. క్రాక్ హిట్ తో గోపీచంద్ మలినేని ఇద్దరు తమ సూపర్ హిట్ ట్రాక్ లో ఉన్నారు. కాబట్టి రాబోయే సినిమా కూడా హిట్ అయ్యి తీరుతుందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకు టైటిల్ గా రెండు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అందులో ఒకటి కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న జై బాలయ్య కాగా మరొకటి రెడ్డి గారు అని అనుకుంటున్నారట. జై బాలయ్య టైటిల్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తారట.

ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు (Balakrishna) అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రీసెంట్ గా వచ్చింది. ఈ రెండు సినిమాలతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటనున్నారు.

Tags: Akhanda, balakrishna, balayya, Gopichand Malineni, NBK 107, Shruthi Hassan, Tollywood