హైద‌రాబాద్‌లోనే వెరీ స్పెష‌ల్‌… ప్ర‌భాస్ కొత్త ఫామ్ హౌస్ సీక్రెట్ ఇదే..!

చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది అగ్ర హీరోలకు విలాసవంతమైన ఫామ్ హౌస్‌లు ఎన్నో ఉన్నాయి.. షూటింగ్ లేన‌ప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి లేదా వీకెండ్ ఎంజాయ్‌మెంట్ల‌కు ఈ ఫామ్ హౌస్‌లు వాడుతూ ఉంటారు. హీరోల ఫామ్ హౌస్ ల‌లో పార్టీలు, ఇతర ఈవెంట్లు కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి కూడా అందరి హీరోల మాదిరిగానే హైద‌రాబాద్‌కు స‌మీపంలో ఉన్న‌ రాయదుర్గంలో ఓ భారీ ఫామ్ హౌస్ ఉంది.

Prabhas on Radhe Shyam's failure: 'Maybe we missed something in script' -  Hindustan Times

ఇది ఒకప్పుడు హైదరాబాదుకు దూరంగా ఉండేది.. ఇప్పుడు రాయదుర్గం కూడా హైదరాబాద్ నగరంలో కలిసిపోయింది. దీంతో ప్రభాస్ ప్రశాంతమైన వాతావరణానికి దూరమయ్యాడు. ఈ క్ర‌మంలోనే ప్రభాస్ మ‌రో భారీ ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడ‌ట. ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమా రిలీజ్‌కు ముందే సిటీకి దూరంగా దాదాపు ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడట. ఇది మెద‌క్ జిల్లా లిమిట్స్‌లో ఈ భూములు కొన్న‌ట్టు టాక్ ?

ఆ భూమి కూడా సిటీకి ఎంతో దూరంగా ఉండటంతో పాటు చాలా స్పెష‌ల్‌గా ఉంటోంద‌ట‌. ఆ భూమి ఉన్న కొండ నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం ఎంతో అందంగా కనిపిస్తోందట. ఇప్పుడు ప్రభాస్ అక్కడ ఎంతో ఖరీదైన ఫామ్ హౌస్ నిర్మించబోతున్నారట. ఈ ఫామ్ హౌస్ నిర్మాణానికి ప్రభాస్ భారీగా ఖర్చు చేస్తున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి.

Prabhas Luxury Life | Net Worth | Salary | Business | Cars | House |  Marriage | Family | Biography - YouTube

ఈ ఫామ్‌హౌస్ కోసం వాడే ఉడ్‌, రాయి అంతా ఇట‌లీ నుంచి దిగుమ‌తి చేస్తున్నార‌ట‌. చాలా టాప్ మోస్ట్ డిజైన‌ర్లు ఇచ్చిన ఇంటీరియ‌ర్ డిజైనింగ్ వాడుతున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ వరుస‌ సినిమాలు కమిట్ అవుతూ ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్‌లో ఉన్నాడు.ఈ రేంజ్‌లో సంపాద‌న ఉన్న‌ ప్రభాస్ ఆ ఫామ్ హౌస్ కి ఏ రేంజ్‌లో ఖర్చు పెడుతున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు.