ఆ ఒక్క ప్లాన్‌తో ఏకంగా రు. 100 కోట్లు.. యంగ్ టైగర్ దెబ్బతో ఇండ‌స్ట్రీ షేక్‌…!

సినిమా ఇండస్ట్రీలో న‌టిన‌టులు ఎవ‌రైన‌ తెలివిగా ఎంతోకొంత డబ్బును కూడా పెట్టుకోవాలని ఉద్దేశంతో ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇదే బాటలో నడుస్తున్నాడు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వచ్చే సినిమాలపై ఒక మంచి ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమాలు అన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

NTR30: రౌద్రంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్.. ఏం చేస్తిరి ఏం చేస్తిరి! - ntr30  first look poster trending in socal media - Samayam Telugu

ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న న‌టించే సినిమాలన్నింటిలోనూ లాభాల్లో వాటాలు తీసుకునే ఆలోచన చేస్తున్నాడట. ఎన్టీఆర్ 31వ సినిమా లో నటించడానికి కేవలం రు. 30 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దాంతో పాటు ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని ఎన్టీఆర్‌కు ఇస్తారు. ఇప్పటికే ఈ సినిమాకు వార్ 2 అనే టైటిల్ ఖరారు చేశారు.

NTR 31: First look of Jr. NTR, Prashanth Neel movie "Telugu Movies, Music,  Reviews and Latest News"

అలాగే ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 32 సినిమాలకు ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండగా ఈ సినిమాలకు ఎన్టీఆర్ రెమ్యూనిరేషన్ తీసుకోవడం లేదు.. సినిమాలు రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో ఎన్టీఆర్ కి కొంత వాటా ఉంటుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. గ‌త ఏడాది రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.

War 2 Movie Trailer First look Releasing Latest Update | Hrithik Roshan |  Jr NTR | Salman khan - YouTube

ప్రస్తుతం ఎన్టీఆర్ నటించబోతున్న ఎన్టీఆర్ 30, వార్ 2, ఎన్టీఆర్ 32 సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తే మాత్రంఎన్టీఆర్ కు రు. 100 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఈ వార్తలు వినిపించడంతో.. ఎన్టీఆర్ ప్లాన్ కు కొంతమంది ప్రశంసలు కురిపించగా. మరికొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఆ ఒక్క ప్లాన్‌తో ఏకంగా 100 కోట్లా.. యంగ్ టైగర్ దెబ్బతో టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు షేక్ అవుతాయ‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.