ఖుషి సినిమా హిట్ అవ్వడంతో హీరో విజయ్ దేవరకొండ ఆనందానికి అవధులు లేవు. ఈ సంతోషాన్ని తన అభిమానులతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక ఖుషి సినిమాకు తనకు వచ్చిన రెమ్యనరేషన్ నుంచి కోటి రూపాయలను తన దేవర కుటుంబాలకు చెందిన వారికి ఇస్తానని విజయ్ ప్రకటించాడు. దీంతో విజయ్‌ది చాలా గొప్ప మనసు అంటూ సోషల్ మీడియాలో ఒక్కటే ఆయనపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను పంపిణీ చేసిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ పిక్చర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సినిమాను పంపిణీ చేసి తాము ఏకంగా ఎనిమిది కోట్లు నష్టపోయామని.. మాకు కూడా సాయం అందించాలంటూ ఆ సంస్థ విజయ్‌కు ట్వీట్ వేస్తూ ప్రశ్నించింది.
డియర్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పంపిణీ చేసి రు. 8 కోట్లు నష్టపోయాం. ఇంతవరకు దీనిపై ఎవరూ స్పందించలేదు.. మీ గొప్ప మనసుతో కోటి రూపాయలను పలు కుటుంబాలకు సాయం చేస్తున్నారు.. అలాగే మా డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాం అంటూ సదరు నిర్మాణ సంస్థ ట్విట్ చేసింది. మరి దీనిపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.