టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమతో ఆమెను చూసుకుంటారు. 18 సంవత్సరాలుగా ఆమె తెలుగులో సినిమాలు చేస్తోంది. అలాగే తెలుగు సినిమా బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పటికే 47 వయసు దాటిపోయినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. గతంలో అనుష్క పెళ్లిపై ఎన్నో రూమర్లు వచ్చాయి.
ఇక అనుష్క టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది ఐదారు సంవత్సరాలుగా జరుగుతోందే..! అటు ప్రభాస్ ఇటు అనుష్క పెళ్లి ప్రస్తావన ఎప్పుడు వచ్చిన కూడా వీరిద్దరి పెళ్లి జరిగితే బాగుంటుంది అని అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క తన పెళ్లి గురించి మాట్లాడింది.
త్వరలోనే పెళ్లిపై గుడ్ న్యూస్ ఉందనేలా కామెంట్స్ చేసింది. బాహుబలి తెచ్చుకున్న అనుష్క సైజ్ జీరో సినిమాతో లావుగా మారి ప్రయోగం చేసింది. ఆ సినిమా ప్లాప్ అయింది. అయితే అప్పటినుంచి అనుష్క బరువు తగ్గలేకపోయింది.. ఇక పెళ్లి గురించి అనుష్క మాట్లాడుతూ పెళ్లిపై నాకు పూర్తి నమ్మకం ఉంది.. అయితే వివాహానికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదు.. టైం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.
దీంతో అందరి కళ్ళు మరోసారి ప్రభాస్ పై పడ్డాయి. ఎందుకంటే ? అటు ప్రభాస్‌కు కూడా ఇంకా పెళ్లి కాలేదు. అనుష్క ఇప్పుడు త్వరలోనే పెళ్లి ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ – అనుష్క పెళ్లి చేసుకుంటారా ? అని ఈ ఇద్దరు అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు అందరూ మంచి శుభవార్త చెబుతారని ఎదురుచూస్తున్నారు.