షారుక్ ఖాతాలో జవాన్‌తో మరో భారీ హిట్ పడిందని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా షారుక్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. జవాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయమని… షారుక్ కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి.
కథనం ఆకట్టుకుంది.. షారుక్ నటన అదుర్స్ అని కొందరు చెబుతున్నారు. మరికొందరైతే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇది అని కామెంట్ చేస్తున్నారు. ఎమోషన్లతో అట్లీ అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దాడు. ఈ ఏడాది షారుక్ ఖాన్‌ది. విజయ్ సేతుపతి – నయనతార అద్భుతంగా నటించారు. జవాన్ చూడటం అస్సలు మిస్ కావొద్దు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. జవాన్ అంచనాల కంటే ఎక్కువగా ఉందని మరికొందరు చెబుతున్నారు.
ఒక నెటిజన్ మాత్రం ఫస్టాఫ్ ఓకే.. సెకండ్ హాఫ్ యావరేజ్.. నయనతార ఎంట్రీ బాగుంది.. విజయ్ సేతుపతి నటన అద్భుతం.. ఒక మాటలో చెప్పాలంటే జవాన్ అందరిని అలరిస్తుంది అని కామెంట్ చేశారు. ఏది ఏమైన షారుక్ ఖాన్ అదిరిపోయే హిట్టు కొట్టాడు అన్న కామెంట్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. పూర్తి రివ్యూతో జవాన్ రిజల్ట్ ఏంటో కొద్ది సేపట్లో తేలిపోనుంది. ప్రీమియర్ టాక్ మాత్రం జవాన్‌కు భీభత్సంగా వచ్చింది.