బాలయ్య సినిమాకు ఊర‌మాస్ టైటిల్‌… సిల్వ‌ర్‌సీన్ షేక్‌… బాక్సాఫీస్ బ్రేక్‌…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలోనే వరుసగా క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆఖండతో మొదలైన బాలయ్య విజయ దండయాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు వెళ్లింది. ప్రస్తుతం బాలయ్య టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడితో భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

Exclusive: Balakrishna's Role In Anil Ravipudi's Film

అలాగే మ‌రో యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంద‌ని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. శ్రీలీల‌ బాలయ్యకు కూతురుగా నటిస్తుందంటున్నా…వ‌రుస‌కు కూతురు పాత్ర‌గా ఇది ఉంటుదంటున్నారు. ఎన్.బి.కె 108 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముందుగా ఈ సినిమా టైటిల్‌గా ” బ్రో..ఐ డోంట్ కేర్ ” అనే టైటిల్ పరిశీలించారట మేకర్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమాకు బ్రో అనే టైటిల్‌ కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్, టైటిల్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు బాలయ్య సినిమాకు మరో పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మోనార్క్ అనే ఓ ప‌వ‌ర్‌ఫుల్‌ టైటిల్‌ ఫిక్స్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

Nandamuri Balakrishna's first look from #NBK108 out on Ugadi

 

ఈ టైటిల్ బాల‌య్య‌ బాడీ లాంగ్వేజ్‌కు ఎంతో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంద‌ని సినిమా యూనిట్ భావిస్తున్నారట. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేయాలని భావిస్తుంది. మరి అనిల్ – బాలయ్య కాంబోలో వస్తున‌ ఈ సినిమా ఎలాంటి ? రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.