ఇక మన చిత్ర పరిశ్రమలో రీల్ లైఫ్ లో అలరించిన కొన్ని జంటలు రియల్ లైఫ్‌లోను ఒకటయ్యారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కూడా చేరబోతున్నారు. మిస్టర్, అంతరిక్షం సినిమాలలో కలిసి నటించిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది. ఇక ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మన తెలుగు చిత్ర పరిశ్రమలో రీల్ నుంచి రియల్ లైఫ్ జంటలుగా మారిన సెలబ్రిటీల గురించి ఒకసారి తెలుసుకుందాం.
మన ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమంలోనే ఆల్ టైం హిట్ జంటల్లో కృష్ణ- విజయనిర్మల జోడి ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో సినిమాల్లో కలిసి నటించి అలరించిన ఈ జంట నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇక ఆ తర్వాత నాగార్జున- అమల, శ్రీకాంత్-ఊహ, రాజశేఖర్-జీవిత, మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ జోడీలు ఉన్నాయి. వెండితెరపై అలరించిన ఈ జంటలు నిజ జీవితంలోనూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నాయి.
అయితే నాగార్జునకు ముందు హీరో వెంకటేష్ సోదరి శ్రీలక్ష్మితో వివాహం జరిగింది. అయితే హీరో నాగచైతన్య జన్మించాక వీరి మధ్య మనస్పర్థలతో విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున అమలును వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జోడి కూడా వారి బాటలోనే నడవనుంది . కాగా, పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్, నాగ చైతన్య-సమంత జంటలు కూడా కలిసి నటించడమే కాకుండా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
అయితే కొన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేశాక.. ఏవో వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఏది ఏమైనా లవ్ స్టోరీస్ కేవలం స్క్రీన్ మీదే కాకుండా నీజ జీవితంలోను గొప్పగా పండుతాయని చెప్పటానికి ఈ జంటలు చాలు ఏమో..!