ఓ మై గాడ్: ఏఆర్ రెహమాన్ మతం మార్చుకునింది అందుకేనా..? సంచలన విషయాన్ని బయటపెట్టిన స్టార్ డైరెక్టర్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు గెలిచిన ఘ‌నుడు. రెహమాన్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి కాంపిటీషన్ పెరగడంతో టాలీవుడ్లో కొద్దిగా క్రేజ్ తగ్గిందని చెప్పాలి. రెహమాన్ టాలీవుడ్ లో మ్యూజిక్ కంపోజ్ చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. చాలా సింపుల్‌గా ఉండే రెహ్మ‌న్ గురించి చాలా విష‌యాలు బ‌య‌ట‌కు రావు. ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. అసలు విషయానికి వస్తే ఎప్పుడు కాంట్రవర్షల్ కామెంట్స్‌తో వివాదాల్లో చిక్కుకొనే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెహమాన్ గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.

In conversation with AR Rahman on his upcoming sufi music concert - The  Hindu

నేను దేవుడిని నమ్మనని.. దేవుడిని నమ్మితే పాపాలు చేయడం కుదరదని.. అందుకే నేను దేవుడిని నమ్మును.. దేవుడిని నమ్మకపోతే మనం మనకు నచ్చినట్లు ఉండవచ్చు… అందుకే నేను దేవుడిని నమ్మాలి అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు వర్మ. అందరికీ అమెరికా వెళ్లాలని ఉంటుంది… అమెరికాలో కొలిచే దైవమే నాకు దేవుడని వర్మ చెప్పుకొచ్చాడు.

AR Rahman hosts musical wedding reception for daughter Khatija in Chennai;  Manisha Koirala, Yo Yo Honey Singh share pics and videos | Entertainment  News,The Indian Express

ఈ క్రమంలో రెహమాన్ గురించి మాట్లాడుతూ రెహ్మ‌న్ హిందూ అని అతని అసలు పేరు దిలీప్ కాగా సాయిబాబా, బాలాజీ గుడికి వెళ్లే ఇతను ఆ తర్వాత మతం మార్చుకుని రెహమాన్ గా పేరు పెట్టుకున్నాడని చెప్పాడు. మతం మారిన వెంటనే అత‌డు సక్స‌స్ అయ్యాడని ఆర్జీవి చెప్పుకొచ్చాడు. మోహన్ బాబు సాయిబాబాని పూజించడంతో నేను.. ఒకసారి ఏఆర్ రెహ్మ‌న్‌లా మీరు ట్రై చేయొచ్చు కదా అని అన్నానని వర్మ చెప్పుకొచ్చాడు.

25 Years Of Rangeela: AR Rahman reveals that Ram Gopal Verma and him  weren't allowed to go in at the premiere : Bollywood News - Bollywood  Hungama

హిందువులు మతం మారతారు.. కాని ముస్లింలు, క్రైస్తవులు ఎప్పుడు మతం మారినట్టు నేను చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. ఇలా ఏఆర్ రెహమాన్ మతం మార్చుకునే అంత సక్సెస్ అయ్యాడు అంటూ వర్మ చేసిన కామెంట్స్ నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. దీంతో రెహ్మ‌న్ మతం మార‌డం వెనుక ఇంత‌ కారణం ఉందా..? మతం మారడం వల్లే అతనికి అంత పాపులారిటీ వచ్చిందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.