మోహన్ బాబుని ఘోరంగా అవ‌మానించిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు…!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈయన తర్వాత చిత్ర పరిశ్రమలోకి తన ఇద్దరి కొడుకులను, కూతురిని పరిచయం చేశారు. కానీ వారు మాత్రం చిత్ర పరిశ్రమంలో అంత స‌క్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే తన సినిమాల‌ విషయంలో ఎంత క్రమశిక్షణగా ఉంటారో ఎన్నో సందర్భాల్లో మనం చూసాం.

Four men arrested for trespassing into Telugu actor Mohan Babu's farmhouse  | The News Minute

అయ‌న ముందు ఎవరు వెక్కిలి వేషాలు వేసినా, క్రమశిక్షణగా లేకపోయినా వారి తోకలను కట్ చేసేస్తాడు. ఈయన ఏదైనా సినిమా షూటింగ్లోకి వస్తున్నాడంటే అక్కడున్న వాళ్లంతా సైలెంట్ గా మారిపోవాలి. అలాంటి మోహన్ బాబుని ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచారట. మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికీ ప్రతిరోజు సోషల్ మీడియాలో ట్రోల్స్ గురవుతూ ఉంటారు.

Music Director Koti: Coronation of a song.. Music Director Koti gets a rare  honor in the Parliament of Australia » Jstimesnow

 

గత కొంతకాలంగా మోహ‌న్‌బాబు ఫ్యామిలీపై మరీ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే గతంలో మ్యూజిక్ డైరెక్టర్ కోటికి, మోహన్ బాబుకి ఓ సినిమా విషయంలో గొడవ జరిగింది. మోహన్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కోటినే పని చేశాడు. ఇందులో భాగంగానే మోహన్ బాబు ఓ సినిమా షూటింగ్లో కోటి దగ్గరికి వెళ్లి ప్రతిసారి ఈ మ్యూజిక్ బాలేదు ఆ ట్యూన్ తీసేయ్ అంటూ చాలా చిరాకు తెప్పించేవారట.

ఒక టైమ్‌లో విసుక్కున్న కోటి, మోహన్ బాబుపై కోపంతో నీకు నా రికార్డింగ్స్ స్టూడియోలో నీకేం పని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడట. ఇక దాంతో చేసేదేమీ లేక మోహన్ బాబు ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి బయటికి వచ్చేసారట. ఆ తర్వాత కూడా మోహన్ బాబు, కోటి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో పెద‌రాయుడు సినిమా ఎంతటి సెన్సేషన్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అప్పట్లో మోహన్ బాబుకి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి మధ్య ఎప్పుడు గొడవ జరుగుతూనే  ఉండేది ఆయనెవరంటే.. | issues between music director koti and hero mohan babu  at that time details ...

కోటి – మోహన్ బాబు కాంబోలో వచ్చిన సినిమాల్లో వీరిద్దరికి గొడవ జరిగినందువల్ల షూటింగ్ సమయంలో ఒకరి మొహాలు ఒకరు చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కానీ షూటింగ్ పూర్తీ అయ్యాక మళ్ళీ గొడవలు ముగిసిపోయి ఫ్రెండ్స్ లా ఉండేవారట.