శర్వానంద్ పెళ్లి జరిగే లీలా ప్యాలెస్ రోజు రెంట్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది.హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు రామ్‌చరణ్‌, ఉపాసన, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఐదు నెలలు కావాల్సి వస్తుంది.

Telugu Actor Sharwanand Gets Engaged To Rakshita Reddy In A Dreamy Ceremony  | See Pics

ఇంతవరకు వీరి పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో పెళ్లి బ్రేక్ అయ్యిందనే టాక్ కూడా వినిపించింది. శర్వానంద్ తన పెళ్లి రద్దు చేసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదంటూ శర్వానంద్ టీం క్లారిటీ ఇచ్చింది. అలాంటిదేమీ లేద‌ని వీళ్లిద్దరు పెళ్లి పీటలెక్క‌బోతున్నారంటూ చెప్పడంతో అందరూ కామ్ అయిపోయారు. వీరి వివాహం వచ్చే నెల మొదటి వారంలో జరగబోతుందని ఓ వార్త వినిపిస్తుంది.

Alleged Lovers Aditi-Siddharth Pose With Newly-Engaged Sharwanand &  Rakshita, Did They Just Made It Official? - Filmibeat

శ‌ర్వా – ర‌క్షిత‌ పెళ్లి జైపూర్ లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. రెండు రోజుల పాటు ఈ పెళ్లి జ‌ర‌గ‌నుంది. శర్వానంద్ – రక్షిత రెడ్డి ప్రీ వెడ్డింగ్ ఎంతో ఘనంగా జరగనుందట.. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. శర్వానంద్ తన పెళ్లికి కేవలం తన స్నేహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారని తెలుస్తుంది. పెళ్లి జరిగాక హైదరాబాద్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఇస్తారు. శర్వానంద్ తన పెళ్లిని ఓ భారీ ఈవెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.

Hero-Sharwanand-got-engaged-to-Rakshita - Telugu Lives - Telugu Latest News

శ‌ర్వా పెళ్లి చేసుకోబోయే లీలా ప్యాలెస్ ఆద్దె కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందట. జైపూర్‌లోని లీలా ప్యాలెస్ అద్దె ఖరీదు రోజుకి రూ.5 కోట్ల ఉంటుందంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శర్వా తన పెళ్లికి రూ.20 కోట్లు ఖర్చుపెట్టి ఆ ప్యాలెస్ బుక్ చేసుకున్నారట. ప్యాలెస్‌కే ఇంత మొత్తంలో ఖర్చు పెడితే మిగతా వాటికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అంటూ సినీ జ‌నాలు నోరెళ్ళబెడుతున్నారు.