మృణాల్ ఠాగూర్ బంప‌ర్ ఛాన్స్ కొట్టేసిందే.. ఇక అమ్మ‌డిని ఆప‌లేం..!

హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా ఎవ్వరైనా సరే ఒక్క హిట్ చాలు. వారి కెరీర్ సాలిడ్ గా సెటిల్ అయిపోవచ్చు. ఆ తర్వాత ఎన్ని హిట్, ఫ్లాప్ వచ్చిన అవి ఆట పాట లాంటివే కొన్నాళ్లకు సర్దుకుంటాయి. నటి మృణాల్‌ ఠాకూర్ జీవితం కూడా ఇంతే. మోడలింగ్ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చి పలు యాడ్స్ లో నటించింది. అనంతరం సినిమాల్లోకి వచ్చింది.

పలు మురాఠీ, హిందీ చిత్రాల్లో నటించిన రాని క్రేజ్ తెలుగులో ‘ సీతారామం ‘ అనే ఒక్క చిత్రంతో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం హిందీ, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో నాని హీరోగా “హాయ్ నాన్న ” సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ కి ఇప్పుడు కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కొత్త సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్ ని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.

ల్తెకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మంచనుంది. అనిరుధ్‌ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. శివ కార్తికేయన్‌ మూవీరన్ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ హీరో కమలహాసన్ నిర్వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఇది పూర్తయిన తర్వాత శివ కార్తికేయన్- మురగదాస్ కాంబోలో సినిమా మొదలు పెట్టనన్నాడు. రజనీకాంత్ తో చేసిన దర్బార్ ఫ్లాప్ తర్వాత మురగదాస్ మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు శివ కార్తికేయన్‌తో చేస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్ళబోతున్న ఈ చిత్ర ఇతర వివరాలు త్వరలో తెలుస్తాయి.