ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరపై ఓ క్రేజీ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సొర చాపతో పోరాడే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. గతంలో జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వీరిద్దరూ మళ్లీ జతకట్టారు. దేవర సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఒక్కో అప్డేట్ హైప్ పెంచేస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజుకి విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.
ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎన్టీఆర్ రా అండ్ రస్టిక్ లుక్ లో మరింత అంచనాలు పెంచాడు. ఇక విడుదలకు సమయం తక్కువే ఉంది. అందుకే త్వర త్వరగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మార్చ్ లో షూటింగ్ ప్రారంభం కాగా వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న న్యూస్ టాలీవుడ్ వర్గాలను షేక్ చేస్తుంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ సొర చేపతో తలపడతాడట. సముద్రంలో ఎన్టీఆర్, సొర చాప మధ్య ఓ యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడట కొరటాల శివ.
ఈ ఫైట్ సినిమాకే హైలెట్ కానుందట. ఎన్టీఆర్ జాలరి రోల్ చేస్తున్న రన్నింగ్ న్యూస్ వినిపిస్తుండగా చాపల వేట సమయంలో ఈ సీన్ వస్తుందట. దీనిపై అధికారికంగా సమాచారం లేనప్పటికీ న్యూస్ వినిపిస్తుంది. దేవర దాదాపు రూ.300కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జాన్నీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఆమెకు ఇదే సౌత్ ఫస్ట్ మూవీ. ఇక సైఫ్ ఖాలి ఖాన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 2024 ఏప్రిల్ 5న దేవర ప్రేక్షకుల ముందుకి రానుంది.