క‌ళ్యాణ్‌రామ్ కోసం బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా త్యాగం చేసిన ఎన్టీఆర్‌… ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ఇద్దరు ఎంతో ఆప్యాయత, అనురాగంతో ఉంటారన్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ర్ వరుసగా సినిమాలు నిర్మించి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడ్డారు. ముఖ్యంగా కిక్ 2 సినిమా డిజాస్టర్ అవడంతో కళ్యాణ్ రామ్ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ తన అన్నను ఆర్థికంగా నెరబెట్టేందుకు జై లవకుశ సినిమా చేసి ఆ సినిమాతో కళ్యాణ్ రామ్ ను గట్టెక్కించేశారు.

ఇది ఇలా ఉంటే తన అన్న కోసం ఎన్టీఆర్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాను త్యాగం చేయటం విశేషం. ఆ సినిమా ఏదో కాదు పటాస్. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైన పటాస్ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించ‌గా ఈ సినిమా కథను దర్శ‌కుడు అనిల్ ముందుగా కళ్యాణ్ రామ్‌కు వినిపించగా ఈ సినిమాను తప్పకుండా తన బ్యానర్ లో నిర్మిస్తాను.. అయితే నాకంటే మరో పెద్ద హీరోతో చేస్తే బాగుంటుందని కళ్యాణ్ రామ్ చెప్పారు.

ఇక‌ ఎన్టీఆర్‌కు కూడా ఇదే క‌థ వినిపించారు. అయితే కథ విన్న ఎన్టీఆర్ ఈ కథలో కళ్యాణ్‌రామ్ మాత్రమే నటించాలని.. తాను ఇప్పటికే టెంపర్ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నానని.. కళ్యాణ్ రామ్‌కు ఖచ్చితంగా హిట్ కావలసిన టైం ఇది అని అనిల్ రావిపూడి కి చెప్పారు. అటు అనిల్ రావిపూడి కూడా కళ్యాణ్ రామ్ తోనే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.

తనకు దర్శ‌కుడిగా తొలి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ తోనే సినిమా చేసి హిట్టు కొడతానని ముందే చెప్పేశాడు. అన్నట్టుగానే పటాస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కళ్యాణ్రామ్ కెరీర్ కు మంచి ఊపు తెచ్చింది. అప్పట్లో వరుసగా పటాస్.. ఆ వెంటనే టెంపర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యి నందమూరి అభిమానుల్లో జోష్ నింపాయి.