ప్ర‌భాస్‌తో మ‌రో సినిమాకు ఓకే చెప్పిన అనుష్క‌…. చిన్న కండీష‌న్ ఇదే..!

టాలీవుడ్ స్వీటీ బ్యూటీ అనుష్క 5 సంవత్సరాల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వెండితెరపై కనిపించనుంది. ఈ సినిమా ఈనెల 7న షారుక్ ఖాన్ జవాన్ సినిమాకు పోటీగా మిస్ శెట్టి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు ? ఉంటుంది అన్న ప్రశ్నకు అనుష్క స్పందిస్తూ వెంటనే ఓకే చెప్పేసింది.

ప్రభాస్తో మళ్లీ సినిమా చేసేందుకు తాను రెడీగా ఉన్నాను అని అంటూనే చిన్న కండిషన్ కూడా పెట్టింది. ఆ కండిషన్ ఏదో కాదు మంచి స్క్రిప్ట్ ఉంటే ప్రభాస్ తో మళ్ళీ సినిమా చేయాలని ఉందని చెప్పింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి – బాహుబలి 1, 2 – బిల్లా సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ప్రభాస్ – అనుష్క కాంబినేషన్లో సినిమా అంటే టాలీవుడ్ లో ఎప్పుడు ఏ స్థాయిలో క్రేజీ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అనుష్క వెండి తెరపై కనిపిస్తున్న సినిమా కావటం.. అందులో వయసులో తనకంటే చిన్నోడు అయినా నవీన్ పోలిశెట్టికి జంటగా నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే అనుష్క కొద్ది రోజులు పాటు టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు ఆప్షన్ గా మళ్లీ సినిమాలు చేయనంది.