NTR : భర్త పక్కనే ఆ హీరోయిన్ ని డార్లింగ్ అని పిలిచి షాక్ ఇచ్చిన ఎన్.టి.ఆర్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ (NTR ) చీఫ్ గెస్ట్ గా రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు గ్రాండ్ గా ప్లాన్ చేసినా పోలీసులు షాక్ ఇవ్వడంతో సైలెంట్ గా పార్క్ హయత్ లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ స్పీచ్ కి నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. రణ్ బీర్ గురిచి చెబుతూ అమితాబ్ తర్వాత తనని ఇన్ స్పైర్ చేసిన హీరో రణ్ బీర్ అని అన్నారు తారక్.

ఇక అలియా భట్ గురించి చెబుతూ ఆమె తన డార్లింగ్ అని అన్నారు. ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ లో అలియాతో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ రిలేషన్ తో అలియాని డార్లింగ్ అంటూ సంభోదించాడు ఎన్.టి.ఆర్. మాములుగా ఎన్.టి.ఆర్ ప్రతి ఒక్కరిని చాలా రెస్పెక్ట్ తో పిలుస్తాడు. కానీ అలియాని మాత్రం డార్లింగ్ అనడంతో పక్కనే ఉన్న అలియా భర్త రణ్ బీర్ కపూర్ షాక్ అయ్యాడని చెప్పొచ్చు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా టైం లో అలియా గురించి బాగా తెలుసుకున్న తారక్ (NTR ) ఆమెని డార్లింగ్ అని పిలవడం నందమూరి ఫ్యాన్స్ కి కూడా సర్ ప్రైజ్ చేసింది. ఇక అలియా భట్ కూడా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరవ్వాలని చూస్తుంది. ఎన్.టి.ఆర్ తో డార్లింగ్ అనిపించుకున్న అలియాని నందమూరి ఫ్యాన్స్ కూడా డార్లింగ్ అంటూ ట్వీట్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు.

Tags: Alia Bhatt, Brahmastra Event, karan johar, ntr, rajamouli, Ranbhir Kapoor, RRR, Tollywood