త‌న‌కంటే హైట్ ఎక్కువు ఉంద‌ని ఆ స్టార్ హీరోయిన్‌ను తీసేసిన ఎన్టీఆర్‌…!

అన్న‌గారు ఎన్టీఆర్ అనేక సినిమాల్లో న‌టించారు. అనేక మంది హీరోయిన్ల‌తోనూ ఆయ‌న స్టెప్పులు వేశారు. హీరోయిన్లే కాదు.. వారి వార‌సుల‌తోనూ అన్న‌గారు ఆడిపాడారు. అయితే, ఒక‌రిద్దరి విష‌యానికి వ‌స్తే.. మాత్రం అన్నగారు ఒక‌టి రెండు సినిమాల‌తోనే స‌రిపుచ్చారు. దీనికి కార‌ణం.. వారికి అన్న‌గారికి మ‌ధ్య పొర‌పొచ్చాలు రావ‌డ‌మే. త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌తో అనేక సినిమాల్లో అన్న‌గారు న‌టించారు. అయితే, ఆమె రాజ‌కీయ అరంగేట్రం చేశాక వ‌దిలేసుకున్నారు.

K R Vijaya Photos, Pictures, Wallpapers,

ఇలా.. కొంద‌రిని ప‌లు కార‌ణాల‌తో వ‌దిలేసుకున్నారు. ఇలానే ల‌క్ష్మీక‌టాక్షం సినిమాలో అప్ప‌టి హీరోయిన్ కేఆర్ విజ‌య‌తో అన్న‌గారు ఆడిపాడారు. ఇది బి. విఠ‌లాచార్య తీసిన సినిమా. ఈ సినిమాలో సి. నారాయ‌ణ‌రెడ్డి రాసిన అన్నిపాట‌లూ.. ఇప్ప‌టికీ సూప‌ర్ హిట్లే. అయితే.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కేఆర్ విజ‌యతో అన్న‌గారు పెద్ద‌గా న‌టించ‌లేదు. దీనికి కార‌ణం.. హైట్ తేడా వ‌చ్చింద‌నే టాక్ సినిమా రంగంలో వినిపించింది.

 

ప్ర‌స్తుతం హైట్ తో సంబంధం లేకుండా స్కిన్ షోల‌కే ప్రాధాన్యం ఇస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కానీ, గ‌తంలో హీరో కంటే హీరోయిన్ రెండు అంగుళాలు త‌క్కువ ఉండాల‌నేది నిబంధ‌న‌. అన్న‌గారు..అలానే పాటించారు. అయితే.. కేఆర్ విజ‌య అన్న‌గారి కంటే కూడా రెండు అంగుళాలు హైట్‌. దీంతో అన్న‌గారితో సీన్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. విఠ‌లాచార్య ఆమెకు కుర‌చ దుస్తులు వేసి స‌రిపుచ్చారు.

When NTR Surprised Choreographer | cinejosh.com

అయితే, కేఆర్ విజ‌య మాత్రం కుర‌చ దుస్తులు వేసుకునేందుకు ఇష్ట‌ప‌డే వారు కాదు. దీంతో త‌ర్వాత సినిమాల్లో అన్న‌గారితో ఆమె న‌టించ‌లేదు. అన్న‌గారుకూడా ఆమె వ‌ద్దులే.. ఆమె బ‌దులు అంజ‌లీ దేవిని పెట్టండి చెబుతూ వ‌చ్చారు. ఇలా.. కేఆర్ విజ‌యతో ఆయ‌న త‌ప్పుకొన్నారు. కార‌ణం హైటే అయినా.. అప్ప‌ట్లో ప్ర‌జ‌లు, అభిమానులు దీనిని బాగానే ప్ర‌చారంలోకి తెచ్చేవారు. దీంతో అన్న‌గారికి అభిమానుల తాకిడి ఎక్కువై.. ఏకంగా సినిమాలు వ‌దులుకున్నారు.