ఆ నిర్మాత‌తోనే అనుష్క పెళ్లి… కాబోయే భ‌ర్త ఎవ‌రు అంటే…!

సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఆ స్టార్ డ‌మ్ ను అలాగే నిలబెట్టుకోవడం చాలా కష్టమైన విషయం. ఈ తరం స్టార్ హీరోయిన్స్ చాలామంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన‌ నాలుగైదు సంవత్సరాలలోపే ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. అనుష్క మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది.

Anushka Shetty Cute Saree Photos, Images | Bollymira

నాగార్జున హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అనుష్క ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఎంతోమంది అగ్ర హీరోలతో చాలా సినిమాలలో నటించిన అనుష్క‌.. ప్రభాస్ హీరోగా రానా ప్రతినాయకుడిగా నటించినా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Anushka-shetty - Makeup Training Academy

ఆమె వయసు 40 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ ఆమె ఇంకా పెళ్లి చేసుకోక‌పోడంతో అనుష్క – ప్రభాస్ మధ్య ప్రేమాయణం నడిచింది అంటూ.. వారిద్దరి మధ్య గొడవల కారణంగా ఇద్దరు ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్త‌లు వినిపించాయి. తరువాత హైదరాబాద్ కి చెందిన ఒక ప్రముఖ గోల్డ్ వ్యాపారితో అనుష్క పెళ్లి ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపించాయి. అయితే అది నిజం కాదని తర్వాత తెలిపోయింది. నిశ్శబ్దం సినిమా తరువాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది.

Pin on Anushka Shetty

ఇటీవ‌ల కాలంలో అనుష్క కర్ణాటక స్టార్ ప్రొడ్యూసర్ అయిన‌ ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనుష్క పెళ్లిపై వచ్చిన వార్తలు అన్ని అబద్ధాలు కావడంతో నిజంగానే అనుష్క ఒక ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతుందా..? లేదా..? అని అనుమానాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ఈ విషయంలో ఎంత నిజం ఉందో అనుష్క స్పందిస్తే గాని తెలియదు.