హన్సిక ఫ‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్ అయ్యేందుకు హోర్మోన్లు ఇంజ‌క్ష‌న్లు ఇచ్చారా… అస‌లేం జ‌రిగింది…!

హన్సిక మోత్వాని అల్లు అర్జున్‌ దేశముదురు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 50 సినిమాలకు పైగా నటించింది. హన్సిక తెలుగులోనే కాక తమిళ, హిందీ భాషల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. చాలామంది హీరోయిన్స్ పై ట్రోల్ జరుగుతున్నట్టే హన్సిక పైన కూడా చాలా ట్రోలింగ్ జరిగింది. ఇటీవల లైవ్ చాట్ లో ఒక త్రో బ్యాక్ విషయాన్ని హన్సిక స్వయంగా చెప్పింది.

Actress Hansika Motwani Sizzling And Hot Images | Actress Hansika Motwani  Sizzling And Hot Images - Actresshansika, Hansika Motwani, Hansikamotwani,  Hansika, Teluguactress

హన్సిక సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో ఆమె ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్‌గా మారేందుకు… త్వరగా ఎదగడానికి హార్మోన్ ఇంజక్షన్ల‌ను ఆమె త‌ల్లి బ‌ల‌వంతంగా ఇచ్చారంటూ పుకార్లు వ‌చ్చాయి. ఆ ఇంజక్షన్ల వల్లే తాను పెద్దగా కనిపించానని మీడియా ప్రచారం చేసిందని చెప్పింది. లవ్ షాది డ్రామా ప్రోగ్రాం లో హన్సిక తల్లి మోనా చాటింగ్ సెషన్ లో మాట్లాడుతూ హన్సిక ఎదిగేందుకు తాను హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చానని.. వార్తలు ప్రచారం చేయ‌డంపై క్లారిటీ ఇచ్చారు.

Did Hansika Motwani's mother give her hormonal injections to make her grow  faster? Actress reacts - India Today

ఈ ఇంజక్షన్ ఏంటో నాకు చెప్పండి..? నేను టాటా బిర్లా కంటే గొప్ప దాన్ని అయితే కాదు. ఏ తల్లి ఇలాంటి పనులు చేయలేదు. మీరు చెప్పండి ఎముకలు పెంచే ఇంజక్షన్ కూడా ఉంటాయా ? అంటూ ఎమోషనల్ అయ్యారు. తర్వాత హన్సిక మోత్వాని మాట్లాడుతూ సెలబ్రిటీ లైఫ్ లో ఇలాంటి పుకార్లు కొంత భాగం మాత్రమే.. ఇలాంటి వాటికి రెడీ అయి ఉండాలి.. సోషల్ మీడియా లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు నాపై ఇలాంటి ప్రచారం చేస్తున్నార‌ని వాపోయింది.

Hansika Motwani's mother reacts to claims of giving her daughter hormonal  injections- 'Would have been richer

ఈ షో వ‌ల్ల‌ అన్నింటికి నేను ఆన్సర్ చేయగలిగానని హన్సిక అన్నారు. నా ఎదుగుదలను భరించలేక ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని.. ఇలాంటి వాటిని నాకు పట్టించుకునే ఖాళీ ఉండదని హన్సిక చెప్పింది.