త్రిబుల్ ఆర్ కంటే ముందే నంద‌మూరి – మెగా కాంబోలో వ‌చ్చిన మ‌రో మ‌ల్టీస్టార‌ర్ తెలుసా…!

నందమూరి, మెగా ఫ్యామిలీ టాలీవుడ్‌లోనే అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న కుటుంబాలు. ఈ కుటుంబాల నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనాగుతున్నారు. వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటాయి. దీంతో సినిమాల పరంగా ఈ రెండు కుటుంబాల మధ్య గట్టి పోటీ నడుస్తూనే ఉంటుంది. ఈ రెండు కుటుంబాల్లోని ఈ తరం హీరోలతో దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా తెరకెక్కించాడు.

Chiranjeevi-K Raghavendra Rao: మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు  రాఘవేంద్రరావు మెగా బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌.. | Megastar Chiranjeevi K  Raghavendra Rao Tollywood Mega Blockbuster ...

ఇందులో ఎన్టీఆర్- రామ్ చరణ్ కలిసి నటించరు. ఈ సినిమా ఆస్కార్ అవార్డును కూడా అందుకుని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో ఈ రెండు కుటుంబాల కలయికలో గతంలో ఓ సినిమా బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. నటరత్న ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి కలిసి తిరుగులేని మనిషి అనే సినిమాలో నటించారు. ఈ సినిమాని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సరిగా రెండు సంవత్సరాల ముందు చేశారు.

1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లాయర్ గా కనిపిస్తే, చిరంజీవి క్లబ్ డాన్సర్ గా కనిపించాడు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి, ఎన్టీఆర్ చెల్లిని పెళ్లి చేసుకుంటారు. ఇక్క‌డ చిరుది నెగటివ్ రోల్. ఈ సినిమా క్లైమాక్స్ వరకు చిరంజీవి విలన్ గా కనిపించి చివరలో రౌడీల ఆట కట్టించేందుకు ఎన్టీఆర్ తో కలిసి ఫైట్ చేసి ఆడియన్స్ ని మెప్పించాడు.

Tiruguleni Manishi (తిరుగులేని మనిషి) 1981 | ♫ tunes

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇలా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే రెండు సంవత్సరాల ముందు చిరంజీవితో నటించి అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆ త‌ర్వాత ఇన్నేళ్ల‌కు త్రిబుల్ ఆర్ సినిమాలో చిరు త‌న‌యుడు, ఎన్టీఆర్ మ‌న‌వ‌డు క‌లిసి న‌టించారు.