జండూబామ్ అవార్డు రేసులో ఉన్న టాలీవుడ్ సినిమాలు ఇవే… !

ఇండస్ట్రీలో హిట్ సినిమాలకు ఎంత మంచిగా గుర్తింపు వస్తుందో.. అదే విధంగా ప్లాప్ సినిమాల‌కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వస్తూ ఉంటుంది. ఏమాత్రం క‌థ‌ లేకుండా బుర్ర త‌క్కువ‌గా తీసిన కొన్ని సినిమాల వల్ల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ లేకపోగా సినిమాకు వెళ్లి ఎదురు తలనొప్పి తెచ్చుకునే విధంగా ఉంటాయి. ఒక సినిమా ఘోర‌మైన‌ ప్లాప్ అయ్యిందంటే ప్రేక్షకుల నుంచి ఎందుకు ? వచ్చాం రా బాబు అన్న కామెంట్లు ప‌డుతుంటాయి.

NOTA Movie Posters | NOTA Movie | Photo 3 of 3

ఈ సినిమాలో ఒక్క పాట బాగోలేదు. పరమ చెత్తగా ఉంది, అస‌లు ఇది సినిమా నేనా, ఈ సినిమా చూస్తే త‌ల‌నొప్పి త‌ప్ప ఏమీ లేదు అనే కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి సినిమాలకు కూడా కేరళలో వెటకారం కోసమో లేదా తర్వాత సినిమాకు జాగ్రత్త పడతారనో కాని కోకోనట్ అవార్డ్స్ ఇచ్చి తమ నిరసన తెలుపుతూ ఉంటారు. అలాగే మన తెలుగులో కూడా కొన్ని సినిమాలకు జండుబాం అవార్డ్స్ ఇవ్వచ్చు అన్న సెటైర్లు సోష‌ల్ మీడియాలో ప‌డుతుంటాయి.

Pantham (2018) - Photo Gallery - IMDb

అలాంటి సినిమాలు తెలుగులోనూ కొన్ని ఉన్నాయి. పైగా అవి స్టార్ హీరోల‌వి కూడా కావ‌డం మ‌రో విశేషం.
నాగార్జున హీరోగా రాంగోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఆఫీసర్ మూవీ. ఇది ఎంత చెత్త డిజాస్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది నష్టాలతో మిగిలిపోయారు. ఇక రెండోది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో డిజాస్టర్‌గా నిలిచి జ‌నానికి జండుబామ్ గుర్తుచేసింది.

Naga Shaurya's Narthanasala Movie Review & Rating

అలానే విజయ్ దేవరకొండ నటించిన నోటా కూడా డిజాస్ట‌ర్‌. నారా రోహిత్ నటించిన వీర భోగ వసంత రాయులు, నాగ శౌర్య నర్తనశాల, అమ్మమ్మగారిల్లు – రామ్ పోతినేని నటించిన హలో గురు ప్రేమకోసమే, మంచు విష్ణు బ్రహ్మానందం కలిసి న‌టించిన‌ ఆచారి అమెరికా యాత్ర, ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ అనుపమ జోడిగా నటించిన తేజ ఐ లవ్ యు, ఇక గోపీచంద్ నటించిన పంతం ఇవన్నీ టాలీవుడ్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఈ సినిమాలు జండుబాం అవార్డ్స్ ఇచ్చేయాల్సిందే అనేంతగా ప్రేక్షకులకు తలనొప్పి తెచ్చిపెట్టాయి.

Veera Bhoga Vasantha Rayalu' review: This vigilante thriller makes no sense  | The News Minute