Arjun Kapoor : మలైకాతో పెళ్లికి సిద్ధంగా లేను.. ఇలా బాంబ్ పేల్చాడేంటి బాసు..!

బాలీవుడ్ హాట్ కపుల్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ (Arjun Kapoor )ల గురించి అందరికి తెలిసిందే. బీ టౌన్ లో వీరి గురించి నిత్యం వార్తలు వస్తుంటాయి. వీళ్లిద్దరి డేటింగ్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. వీరి పెళ్లెప్పుడు అని చూస్తుంటే వీరు మాత్రం దాని గురించి ప్రస్థావించట్లేదు. అంతేకాదు పెళ్లి ఇప్పుడప్పుడే కాదని కూడా చెబుతున్నారు. లేటెస్ట్ గా అర్జున్ కపూర్ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నాడు.

అందులో తాను ఇప్పుడప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు. కొవిడ్ వల్ల రెండేళ్లు సినిమాలు లేక ఖాళీగా ఉన్నానని. ఇప్పుడు కెరియర్ మీద దృష్టి పెట్టదలచుకున్నాని. కెరియర్ బాగున్నప్పుడే పార్ట్ నర్ ని సంతోష పెట్టగలనని అంటున్నాడు అర్జున్ కపూర్. పెళ్లి ఇప్పుడు వద్దంటున్నాడా లేక మలైకాతో పెళ్లి వద్దని అన్నాడా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.

అర్జున్ కపూర్ (Arjun Kapoor ) కూడా ఇక మీద వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు. సోనం కపూర్ తో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అర్జున్ కపూర్ షోలో అడల్ట్ కంటెంట్ బాగానే ఇచ్చారని చెప్పొచ్చు.

Tags: Arjun, Arjun Kapoor, Bollywood, Coffie with Karan, karan johar, Malaika Arora, Sonam Kapoor