మైండ్ బ్లోయింగ్ బిగ్ బ్రేకింగ్‌: హృతిక్ రోష‌న్ – ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్, టైటిల్ కూడా ఫిక్స్‌

ఇటీవల టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ హీరోలతో కలిసి మల్టీ స్టార్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్‌, సలార్‌ సినిమాలలో ఇతర భాషలకు చెందిన హీరోలు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే త్రిబుల్ ఆర్ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాలోను బాలీవుడ్ స్టార్ హీరో విలన్ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈరోజు ఇండియన్ సినిమా మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కాంబినేషన్లో అదిరిపోయే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ సినిమా టైటిల్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇది నిజంగా టాలీవుడ్ సినీ అభిమానులతో పాటు.. నందమూరి అభిమానులు అందరూ పండుగ చేసుకునే రోజు అని చెప్పాలి.

హృతిక్‌రోష‌న్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో వార్ 2 సినిమా తెర‌కెక్క‌నుంది. 2019లో హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్‌ష్రాప్ కాంబినేష‌న్లో వార్ సినిమా తెర‌కెక్కింది. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వార్ 2 వ‌స్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, హృతిక్ న‌టిస్తున్నారు. ఈ విష‌యాన్ని బాలీవుడ్ సినీ విశ్లేష‌కులు త‌రుణ్ ఆద‌ర్శ్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్ర‌క‌టించారు.


ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర లాంటి హిట్ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏదేమైనా అదిరిపోయే కాంబినేష‌న్‌తో ఫ్యీజులు ఎగిరిపోయేలా చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.