ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి ఎన్ని కోట్ల క‌ట్నం తెచ్చిందో తెలుసా… నార్నే ఫ్యామిలీకి అన్ని కోట్ల ఆస్తులా…?

ప్రస్తుతం ఉన్న సినిమా సెలబ్రిటీల్లో అందరూ ప్రేమ వివాహాలు చేసుకోవడం కామన్ అయ్యింది. టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోలు, క్రేజీ హీరోలలో అందరూ ప్రేమ వివాహాలు చేసుకున్నారు. తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకున్నారు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పెద్దలు కుదిర్చిన‌ అమ్మాయిని.. సాంప్రదాయ బద్ధంగా తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు.

Jr NTR gifts a posh farm house to Pranathi

ఎన్టీఆర్ ఎప్పుడు పెద్దల మాట జవదాటడు. ఎంతో క్రమశిక్షణతో పెరిగిన ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులు కుదిరిచిన సంబంధమే చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు మేనకోడలు కుమార్తె లక్ష్మీ ప్రణతి. లక్ష్మీ ప్రణతి ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వారు. ఆమె నార్నే కుటుంబ ఆడపడుచు. ఎన్టీఆర్ మామగారు నార్నె శ్రీనివాసరావు ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ గా ఎదిగారు.

Jr NTR with His Wife Lakshmi Pranathi Rare and Unseen Photos

హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు నార్నె కుటుంబానికి ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌న‌గర్ జిల్లాలోనూ భారీగా ఆస్తులు కూడా పెట్టారు. నార్నే కుటుంబ ఆస్తులు విలువ కోట్లలోనే ఉంటుంది. ఇక స్టూడియో ఎన్ ఛానల్ కూడా ఈ కుటుంబానిదే కావటం విశేషం. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహం 2011 మే 6న జరిగింది. అప్పట్లో ఎన్టీఆర్‌కు కట్నంగా వచ్చిన ఆస్తులకు విలువ ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే రు.1000 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

Jr NTR, wife Lakshmi Pranathi get cosy as they enjoy a 'New York minute.' See cute pic - India Today

ఓవరాల్‌గా స్థిర‌, చరాస్తులు కలిపితే లక్ష్మీ ప్రణతికి తల్లిదండ్రులు మొత్తం రు. 1200 కోట్ల కట్న కానుకలు ఇచ్చారు. ఇక లక్ష్మీ ప్రణతికి పెట్టిన బంగారానికి అయితే లెక్కే లేదని సమాచారం. హైదరాబాద్ చుట్టుపక్కల ఖరీదైన స్థలాలతో పాటు హైదరాబాద్ నడిబొడ్డున ఖరీదైన ఇళ్లు, ప్లాట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్‌కు క‌ట్నంగా గట్టిగానే ముట్టింది.