ఎన్టీఆర్‌ అమ్మ అని పిలిచే ఆ న‌టి ఎవ‌రో తెలుసా… ఈ అనుబంధం వెన‌క స్టోరీ ఇదే…!

నందమూరి తారక రామారావు తెలుగు తెర‌పై చెరగని ముద్రవేశారు ఆయన నటనతో అభిమానులకి తెరపై పాత్రను మాత్రమే పరిచయం చేసిన గొప్ప నటుడు అనిపించుకున్నారు. జానపదం, పౌరాణికం, సాంఘీకం, చారిత్రకం ఇలా ప్రతిదానిలో ఎన్టీఆర్ నటించి మెప్పించారు. ఒక నటుడు గానే కాకుండా రైటర్‌గా, నిర్మాత‌గా… దర్శకుడుగా కూడా ఎన్నో సినిమాలను రూపొందించాడు.

Pandari Bai — The Movie Database (TMDB)

ఇక తన సినీ ప్రయాణంలో ఆయన తన తోటి నటులకు మర్యాద ఇవ్వటమే కాకుండా వారితో మంచి అనుబంధాన్ని పెంచుకున్నాడు.ఇదే సమయంలో ఎన్టీఆర్ తన తల్లిని కాకుండా చిత్ర పరిశ్రమలో మరో వ్యక్తిని కూడా అమ్మ అని ఎంతో ప్రేమగా పిలిచేవారట. చిత్ర పరిశ్రమలో తొలి తరం హీరోయిన్ గా అలరించిన ‘పుండరీ భాయి’ ని ఎన్టీఆర్ ప్రేమగా అమ్మ అని పిలిచేవారట. ఎవరైనా సరే ఆమెను చూస్తే అమ్మ అని పిలవాలనిపించే అంత నిండుగా చీర కట్టుకొని కనిపించే వారట ‘పుండరీ భాయి’.

పాతాళ భైరవి, గజదొంగ వంటి ఎన్నో హిట్ సినిమాల తో పాటు దాదాపు 30 సినిమాలుకు పైగా ఎన్టీఆర్ కి తల్లిగా వెండితెరపై ఆమె నటించారు. సినిమాలలో ఆమెను అమ్మా అని పిలిచే ఎన్టీఆర్ తన నిజ జీవితంలో కూడా ఆమెను అమ్మ అనే ఎప్పుడూ పిలిచేవారట. అలా అమ్మా అని తనకు జన్మనిచ్చిన తల్లి తర్వాత ‘పుండరీ భాయి’ ని మాత్రమే ఎన్టీఆర్ అమ్మ అని పిలిచేవారు.

Legend NTR 95th Jayanthi today,NTR, Nandamuri Taraka Rama Rao, NTR Jayanthi, Hari Krishna, NTR birth anniversary, ntr ghat, jr NTR

కాగా ఈ సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి జరుగుతుండడంతో… గత ఏడాది మే 28 నుంచే ఈ ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలను’ సంవత్సరాది వేడుకలుగా ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యఅతిథిగా శతజయంతి అంకురార్పణ సభని కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈనెల 28న శత జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.