త‌మ‌కంటే వ‌య‌స్సులో పెద్ద హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్‌, మ‌హేష్‌…!

సినిమా పరిశ్రమలలో ఏ హీరో, హీరోయిన్ అయినా ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు కెరీర్ స్టార్టింగ్లో ప‌డే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఒక్క‌సారి క్లిక్ అయితే ఇక వాళ్ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టుకోలేరు. ఇక హీరోయిన్లు త‌మ‌కంటే వ‌య‌స్సులో చాలా చిన్న వాళ్లు అయిన హీరోల‌తో కూడా రొమాన్స్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.

Bhumika Chawla & Jr Ntr Best Love Scene || Telugu Movie Love Scenes ||  Shalimar Cinema - YouTube

సాధార‌ణంగా హీరోల వ‌య‌స్సు ఎక్కువుగా.. హీరోయిన్ల వ‌య‌స్సు త‌క్కువుగా ఉండ‌డం మ‌నం చూస్తూ ఉంటాం. అయితే స్టార్ హీరోలుగా ఉన్న వాళ్లు, త‌మ బంప‌ర్ హిట్ సినిమాల్లో కూడా త‌మ కంటే ఏజ్‌లో పెద్దోళ్లు అయిన హీరోయిన్ల‌తో రొమాన్స్ చేశారు. 25 ఏళ్ల క్రితం ప్రేమ‌క‌థా సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది ప్రేమ‌దేశం సినిమా. ఈ సినిమా చేస్తోన్న టైంలో హీరోయిన్ ట‌బు కంటే అబ్బాస్ వ‌య‌స్సు చాలా త‌క్కువ‌.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌న కంటే వ‌య‌స్సులో పెద్ద అయిన ఓ హీరోయిన్‌తో రొమాన్స్ చేశాడు. పైగా వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన ఆ సినిమా ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. అదే సింహాద్రి. సింహాద్రి సినిమా చేస్తున్న‌ప్పుడు ఎన్టీఆర్ ఏజ్ జ‌స్ట్ 20. అప్పుడు భూమిక వ‌య‌స్సు ఎన్టీఆర్ కంటే కాస్త ఎక్కువే. ఆ సినిమా హిట్ అయ్యాక‌.. మ‌రోసారి ఇదే జోడీ సాంబ సినిమాలోనూ క‌లిసి న‌టించారు.

Mahesh Babu & Namrata Silodkar's Vamsi (2000) Movie Gallery | 123HDgallery

ఇక ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఏకంగా త‌నకంటే వ‌య‌స్సులో పెద్ద‌ది అయిన న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌నే త‌న భార్య‌ను చేసుకున్నాడు. మ‌హేష్‌ .. న‌మ్ర‌త‌తో క‌లిసి వంశీ సినిమాలో న‌టించాడు. ఆమె వ‌య‌స్సులో పెద్ద‌ది అయినా.. అప్ప‌టికే మిస్ ఇండియా కావ‌డంతో ఆమెను కావాల‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ టైంలో వారి మ‌ధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది.

అలాగే యువ‌రాజు సినిమాలో త‌న‌కంటే యేడాది చిన్న‌వాళ్లు అయిన సిమ్రాన్‌, సాక్షి శివానంద్‌తో కూడా మ‌హేష్ రొమాన్స్ చేయ‌డం అప్ప‌ట్లో విమ‌ర్శ‌ల‌కు తావు ఇచ్చింది. వీళ్లు మ‌హేష్ ప‌క్క‌న ఆంటీల్లా ఉన్నార‌న్న టాక్ కూడా వినిపించింది. ఇక బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు అల్లుడు శీను సినిమాతో హీరో గా ప్రేక్షకులకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటే పెద్ద వయసున్న స‌మంత‌తో తొలి సినిమాలో న‌టించాడు.

Yuvaraju Movie || Hai Re Hai Debba Video Song || Mahesh Babu, Sakshi  Sivanand, Simran - YouTube

ఆ మాట‌కు వ‌స్తే శ్రీనివాస్ న‌టించిన హీరోయిన్ల‌లో కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ కూడా అత‌డి కంటే వ‌య‌స్సులో పెద్దోళ్లే. ఇక చాలా మంది కుర్ర హీరోలు ఐటెం సాంగ్‌ల్లో త‌మ‌కంటే చాలా పెద్ద ఏజ్ ఆంటీ హీరోయిన్ల‌తో న‌టించి… బాగా రొమాన్స్ పండించారు.