అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..నందమూరి అభిమానుల కోరిక తీర్చేసిన కొరటాల.. ఆ క్రేజీ బ్యూటీనే ఫిక్స్ చేసాడుగా..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 సినిమా షూట్స్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రెసెంట్ హైదరాబాద్లో జరుగుతున్న మొదటి షెడ్యూల్లో బిజీబిజీగా పాల్గొంటున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమా యూనిట్ గోవాకు పయనమవ్వబోతుంది.

NTR 30: Janhvi Kapoor's new Tollywood movie will launch soon; all details  about the movie - TechnoSports Media Group

గోవాలో ఈ సినిమాకి సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోని సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇప్పటికే ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా జాన్వి కపూర్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ షెడ్యూల్లో జాన్వికపూర్ కూడా పాల్గొనబోతుంది. కాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్లో సెకండ్ హీరోయిన్ కూడా పాల్గొనబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

తెలుగు తెరపై క్రేజీ కాంబో.. ఎన్టీఆర్ తో జోడీ కట్టనున్న సాయి పల్లవి | Rowdy  Baby Sai Pallavi to share screen with Jr.NTR, Sai Pallavi, Jr.NTR, Koratala  Shiva, RRR, acharya - Telugu Acharya, Jr Ntr,

ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి. సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సాయిపల్లవి డాన్స్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. జనాలు ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ లాంటి టాప్ డాన్సర్ తో సాయి పల్లవి జతకట్టబోతుంది అని తెలిసి ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ని కూడా ఇలా ఫుల్ లెంత్ మాస్ రోల్ లో చూసి చాలా కాలమే అవుతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు కచ్చితంగా సాయి పల్లవి ఎన్టీఆర్ తో కాలు కదిపితే స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!